AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

boAT Smarwatch: క్లీన్ లుక్‌లో అదరగొడుతున్న కొత్త స్మార్ట్ వాచ్.. తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు..

బోట్ కంపెనీ వరుసగా స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది. అత్యుత్తమ ఫీచర్లతో పాటు అధిక నాణ్యతతో కూడిన స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తోంది. గత వారంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చిన కంపెనీ ఇప్పుడు వారం తిరక్కుండానే మరో స్మార్ట్ వాచ్ బోట్ లూనార్ విస్టాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ వాచ్ క్లీన్ సర్కులర్ డిజైన్ తో వస్తోంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ దీనిలో ఉంది.

boAT Smarwatch: క్లీన్ లుక్‌లో అదరగొడుతున్న కొత్త స్మార్ట్ వాచ్.. తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు..
Boat Lunar Vista Smartwatch
Madhu
|

Updated on: Sep 11, 2023 | 11:44 AM

Share

బోట్ కంపెనీ వరుసగా స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది. అత్యుత్తమ ఫీచర్లతో పాటు అధిక నాణ్యతతో కూడిన స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తోంది. గత వారంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చిన కంపెనీ ఇప్పుడు వారం తిరక్కుండానే మరో స్మార్ట్ వాచ్ బోట్ లూనార్ విస్టాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ వాచ్ క్లీన్ సర్కులర్ డిజైన్ తో వస్తోంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ దీనిలో ఉంది. ఈ బోట్ లూనార్ విస్టా స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బోట్ లూనార్ విస్టా స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు..

ఈ కొత్త స్మార్ట్ వాచ్ లో 1.52 అంగుళాల హెచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఎండలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీకు 100 వరకూ వాచ్ ఫేసెస్ ను అందిస్తుంది. ఒక సులువైన రోటేటింగ్ బటన్ తో నావిగేషన్ కు అనుమతి ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కు మద్దతు ఇస్తుంది. మంచి మైక్రోఫోన్, డయల్ ప్యాడ్ ఉంటుంది. 10కాంటాక్ట్ ల వరకూ సేవ్ చేసుకోవచ్చు. వీటి సాయంతో వేగంగా కాల్స్ చేసుకొనే వెసులు బాటు ఉంటుంది. ఒకవేళ మీకు స్పోర్ట్స్ లో ఆసక్తి ఉంటే మీకు 100 వరకూ స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉంటాయి.

బోట్ లూనార్ విస్టా స్మార్ట్ వాచ్ ఫీచర్లు..

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో హార్ట్ రేటింగ్ మోనిటరింగ్, రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే మహిళల రుతు చక్రాన్ని ట్రాక్ చేస్తుంది. అదే విధంగా శ్వాస సంబంధిత వ్యాయామాలు దీనిలో ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చొనే పనిచేసేవారికి రిమైండర్లను అందిస్తుంది. కెమెరాలోని ఫోన్ సాయంతో పలు ఫీచర్లను అందిస్తుంది. వెదర్ అప్ డేట్లు, అలారం వంటి అదనపు సదుపాయాలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీనిలో బ్యాటరీ కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒక వారం అంతా చార్జ్ చేయాల్సిన అవసరం రాదు. ఎక్కువ సేపు బ్లూ టూత్ కాల్స్ కి వినియోగిస్తే రెండు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

బోట్ లూనార్ విస్టా స్మార్ట్ వాచ్ ధర, లభ్యత..

ఈ వాచ్ ధర రూ. 1,999గా ఉంది. గ్రే, బ్లూ, గ్రీన్, బ్లాక్(మెటాలిక్ స్ట్రాప్) వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. సేల్ 2023, సెప్టెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!