Ola Scooters Price Hike: ఓలా ఈవీ స్కూటర్ల ప్రియులకు షాక్.. అన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన

గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పోలిస్తే పట్టణ ప్రాంత ప్రజలు ఈవీ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటీవల భారత ప్రభుత్వంఫేమ్ 2 సబ్సిడీల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈవీ వాహనాల ధరలు పెరిగే పరిస్థితి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

Ola Scooters Price Hike: ఓలా ఈవీ స్కూటర్ల ప్రియులకు షాక్.. అన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన
Ola
Follow us

|

Updated on: Jun 02, 2023 | 4:15 PM

భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్ని కంపెనీలు ఈవీ వాహనాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టాయి. పెట్రో వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి భారతదేశ ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోలును పెంచడానికి ఆ స్కూటర్లపై పలు సబ్సిడీలను ఇచ్చింది. దీంతో ఈవీ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సబ్సిడీల తర్వాత పెట్రో వాహనాలతో సరిసమానంగా రేట్లు మారాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈవీ వాహనాల్లో స్కూటర్లను కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పోలిస్తే పట్టణ ప్రాంత ప్రజలు ఈవీ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటీవల భారత ప్రభుత్వంఫేమ్ 2 సబ్సిడీల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈవీ వాహనాల ధరలు పెరిగే పరిస్థితి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు వారి అంచనాలకు తగినట్లే ప్రముఖ ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు అమితంగా ఇష్టపడే ఓలా కంపెనీయే తాజాగా ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో భవిష్యత్‌లో ఇతర కంపెనీలు కూడా ఓలా బాట పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఓలా ఏయే మోడల్స్‌పై ధరలను ఎంత శాతం పెంచిందో? ఓ లుక్కేద్దాం.

భారతదేశ ప్రభుత్వం ఫేమ్ 2 పథకం కింద సబ్సిడి రేట్లను ఈ నెల నుంచి సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేటును దాదాపు 15 శాతం తగ్గించాలని నిర్ణయించడంతో ఈవీ వాహనాల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఓలా కంపెనీ తన టాప్ మోడల్ అయిన ఎస్ 1 ధరను రూ.1.31 లక్షలుగా సవరించింది. ఈ ధర గతంలో రూ.1.15 లక్షలు ఉండేది. 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 141 కిలో మీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే ప్రీమియం ప్రొడెక్ట్ అయిన ఓలా ఎస్ 1 ప్రో ధరను కంపెనీ రూ.1.40 లక్షలుగా పేర్కొంది. ఈ స్కూటర్ ధర గతంలో రూ.1.25 లక్షలుగా ఉండేది. 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్ 181 కిలో మీటర్ల మైలేజ్‌తో పాటు గంటకు గరిష్టంగా 116 కిలో మీటర్ల స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఈవీ స్కూటర్లు సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంలో రిలీజ్ చేసిన ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ ధర గతంలో రూ.85,000 ఉంటే ప్రస్తుతం ఈ ధర రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కూడా 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ప్యాక్‌తో ఓ సారి చార్జి చేస్తే 125 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!