Ola Scooter stolen: ఓలా స్కూటర్‌ను కొట్టేసిన దొంగలు.. రోజుల్లోనే పట్టేసిన ఓనర్.. ఎలాగంటే..?
ముఖ్యంగా ఓలా కంపెనీ ఇన్‌బుల్ట్ జీపీఎస్ ట్రాకర్‌తో తన స్కూటర్లను సేల్ చేస్తుంది. కరెక్ట్‌గా ఈ ఫీచర్ ఓ యువతికి ఉపయోగపడింది. ఆ విషయం ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి వాహనదారుడికి తమ వాహనం అంటే ఓ ప్రత్యేక ప్రేమ ఉంటుంది. మన ప్రతి అవసరాలకు మన వెంటే ఉంటే బైక్ అంటే అందరికీ ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన బైక్‌ను దొంగలిస్తే తల్లిడిల్లుపోతుంటాం. వెంటనే బైక్ కోసం గాలించి దొరక్కపోతే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. వారు వారి పరిధి మేరకు బైక్‌ను కనుక్కొంటానికి సాయం చేస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగింది. ముఖ్యంగా టూ వీలర్స్‌లో వీటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ-బైక్స్‌ను వివిధ ఫీచర్లతో డిజైన్ చేసి కస్టమర్లకు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఓలా కంపెనీ ఇన్‌బుల్ట్ జీపీఎస్ ట్రాకర్‌తో తన స్కూటర్లను సేల్ చేస్తుంది. కరెక్ట్‌గా ఈ ఫీచర్ ఓ యువతికి ఉపయోగపడింది. ఆ విషయం ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఇటీవల జోధ్‌పూర్ నివాసి అయిన అంజలి పాల్ తన ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పోగొట్టుకుంది. దీంతో వెంటనే ఆమె చుట్టుపక్కల వెతికి పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడితో ఆగకుండా ఆమె ట్విట్టర్ ద్వారా ఓలా అఫిషియల్స్‌కు స్కూటర్ పోయిన విషయాన్ని తెలిపి దాన్ని ట్రాక్ చేయడంలో సాయం చేయమని కోరింది. అలాగే కంపెనీకు కూడా పలు మెయిల్స్ చేసింది. దీంతో కంపెనీ ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు స్కూటర్ స్థితి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ స్కూటర్‌ను ఎప్పటికప్పుడు ఓలా కంపెనీ ప్రతినిధులు ట్రాక్ చేస్తున్నారనే విషయం దొంగలకు తెలియదు. ఇలా చూస్తూ చూస్తూ నెల రోజులు గడిచిపోయాయి. ఓలా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు, బాధితురాలికి కూడా చేరవేస్తున్నారు. కరెక్ట్‌గా నెల రోజుల తర్వాత స్కూటర్ లైవ్ లోకేషన్ ద్వారా స్కూటర్‌ను కనుగొని 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులతో కలిసి యువతి ఆ ప్రదేశానికి వెళ్లే సరికి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ స్కూటర్‌ను ప్యాక్ చేసి ఎక్కడికో పంపడానికి వీలుగా పార్శిల్ చేసి ఉంచారు. దీంతో పోలీసులు ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని యువతికి అందించారు. ఈ విషయం బట్టి జీపీఎస్ ట్రాకర్ ఎంత ముఖ్యమైనదో అర్థం అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి