Ola S1 Air: పెట్రో స్కూటర్ల రేట్ కే ఓలా కొత్త స్కూటర్.. ప్రీ బుక్సింగ్స్ ఎప్పటి నుంచి అంటే..?

ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్కూటర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Ola S1 Air: పెట్రో స్కూటర్ల రేట్ కే ఓలా కొత్త స్కూటర్.. ప్రీ బుక్సింగ్స్ ఎప్పటి నుంచి అంటే..?
Ola Electric Scooter
Follow us

|

Updated on: Feb 02, 2023 | 2:46 PM

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ చేసిన వాటిల్లో కొన్ని కంపెనీల స్కూటర్ల మాత్రమే వినియోగదారుల మనస్సును గెలుచుకున్నాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ స్కూటర్లు రిలీజ్ చేస్తున్నామని ప్రకటన వచ్చిన నాటి నుంచి చాలా మంది ఈ స్కూటర్లపై మక్కువ చూపించారు. అలాగే ఓలా ఎస్ 1 బుకింగ్ విండో ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసకున్నారు. ఇంకా ఈ స్కూటర్ బుకింగ్స్ కు సరిపడా స్కూటర్లను ఉత్పత్తి చేయలేకపోతుంది అంటే ఈ స్కూటర్ కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇంత జనాధరణ పొందిన ఈ స్కూటర్ కు కాంబినేషన్ గా మరో స్కూటర్ ను కంపెనీ లాంచ్ చేయబోతుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్కూటర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఫిబ్రవరి 9న కీలక ప్రకటన

ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్ లో ‘ఛేంజ్, ఇట్స్ ఇన్ ఎయిర్’ అనే ట్యాగ్ లైన్ తో ఓ పోస్ట్ చేశారు. అయితే ఈ పేరు ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ గురించేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 9 న నిర్వహించే కంపెనీ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఈ స్కూటర్ సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ ను ప్రీ బుకింగ్స్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 9 నుంచే ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

110 సీసీ పెట్రో బైక్స్ కు ధీటుగా

ప్రస్తుతం హోండా యాక్టివా, సుజుకీ యాక్సిస్ 125 వంటి పెట్రో స్కూటర్ల ధరకే ఈ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రూ.84999 (ఎక్స్ షోరూమ్) ధరకే ఇది అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆన్ రోడ్ రేట్ మాత్రం వేరేగా ఉంటుందని గమనించాలి. ఈ రేట్ హోండా యాక్టివా కంటే కేవలం 4 వేలు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ కంటే రూ.14000 తక్కువకే వస్తుందని మార్కెట్ వర్గాలు చెబతున్నారు. ఈ స్కూటర్ గురించి మరిన్ని అప్ డేట్స్ తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 9 వరకూ వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!