AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కు సరికొత్త సమస్య.. ముందు టైరు ఊడిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త

మొదట్లో బ్యాటరీ సమస్య వచ్చిన ఈ స్కూటర్లు ప్రస్తుత ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ సమస్యతో ముందు టైరు ఊడిపోతుందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 కిలోమీటర్ల సాధారణ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ స్కూటర్ సస్పెన్షన్ రాడ్ ఒక్క సారిగా విరిగిపోయి స్కూటర్ నుంచి టైర్ వేరుగా అయ్యిపోతుంది.

Ola Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కు సరికొత్త సమస్య.. ముందు టైరు ఊడిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త
Ola Scooter
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 6:12 PM

ప్రారంభం నుంచే లుక్, డిజైన్ పరంగా వినియోగదారుల మనస్సును గెలుచుకున్న ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లలో పలు సమస్యలు విసుగు తెప్పిస్తున్నాయి. మొదట్లో బ్యాటరీ సమస్య వచ్చిన ఈ స్కూటర్లు ప్రస్తుత ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ సమస్యతో ముందు టైరు ఊడిపోతుందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 కిలోమీటర్ల సాధారణ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ స్కూటర్ సస్పెన్షన్ రాడ్ ఒక్క సారిగా విరిగిపోయి స్కూటర్ నుంచి టైర్ వేరుగా అయ్యిపోతుంది. ఈ తరహా సమస్యలను ఈ మధ్య కాలంలో ఓలా వినియోగదారులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం.

జనవరి 22 న జరిగిన ఓ ఇలాంటి ప్రమాదంలో ఓ మహిళా రైడర్ గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆ మహిళ భర్త ఘటన వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ భర్త సంకిత్ పర్మార్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఉదయం  9:15 నిమిషాల సమయంలో తన భార్య ఓలా స్కూటర్ పై 35 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని, ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రంట్ సస్పెన్షన్ సమస్యతో ముందు టైర్ ఊడి వచ్చేసిందని ఆందోళన వక్తం చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడిందని పేర్కొన్నాడు. ముఖం, తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె ప్రస్తుతం ఐసీయూ చికిత్స పొందుతుంది.  సంకిత్ పర్మార్ తన పోస్ట్ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ అగర్వాల్ అధికారింకంగా స్పందించాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

అయితే ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ లో ఫ్రంట్ సస్పెన్షన్ సమస్య ఇప్పటిది కాదు. గతంలో చాలా మంది వినియోగదారులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మే 24 న సంజయ్ అనే యూజర్ కూడా తన ఓలా బైక్ ముందు టైర్ ఊడిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహరాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో కూడా స్కూటర్ ముందు చక్రం విడిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా బయటకు రాలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లుక్స్, డిజైన్ పరంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఓలా వినియోగదారుల భద్రతకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కంపెనీ ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..