AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Insurance Companies: కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీలు.. దేశంలో దూకుడుగా బీమా రంగం

దేశ బీమా రంగంలో కొత్త కంపెనీల కొరతకు త్వరలో తెరపడనుంది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆమోదం కోసం 20 కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో దాదాపు డజను బీమా కంపెనీలు ఈ ఏడాది వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది..

New Insurance Companies: కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీలు.. దేశంలో దూకుడుగా బీమా రంగం
Insurance Companies
Subhash Goud
|

Updated on: Jun 02, 2023 | 7:38 PM

Share

దేశ బీమా రంగంలో కొత్త కంపెనీల కొరతకు త్వరలో తెరపడనుంది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆమోదం కోసం 20 కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో దాదాపు డజను బీమా కంపెనీలు ఈ ఏడాది వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. 2047 సంవత్సరం నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ లైఫ్, హెల్త్, ప్రాపర్టీ రక్షణను అందించేందుకు ఐఆర్‌డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో బీమా విస్తరణ చాలా పరిమితంగా ఉంది. ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం.. 2020-21 సంవత్సరంలో దేశంలో జీవిత బీమా కంపెనీల వ్యాప్తి 3.2 శాతంగా ఉంది. అంటే దేశ GDPకి బీమా ప్రీమియం సహకారం 3.2 శాతం అని అర్ధం. అయితే, 2021-22 సంవత్సరంలో జీవిత బీమా ప్రీమియం వార్షిక ప్రాతిపదికన 10.2 శాతం పెరిగింది. మొత్తం ప్రీమియం సేకరణకు కొత్త బిజినెస్‌ నుంచి వచ్చే ఆదాయం 45.5%. రాబోయే దశాబ్దంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా మార్కెట్లలో ఒకటిగా ఉంటుంది. దేశంలో బీమా పరిధిని పెంచడానికి, IRDAI గత కొన్ని నెలలుగా త్వరిత నిర్ణయాలు తీసుకుంటోంది.

ప్లాన్ ఏమిటి?

ఈ ఏడాది దాదాపు డజను బీమా కంపెనీలకు లైసెన్సులు జారీ చేయాలని ఐఆర్‌డీఏ యోచిస్తోంది. అంతకుముందు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది మూడు కంపెనీలకు బీమా లైసెన్సులు ఇచ్చారు. కొత్త లైసెన్స్‌లను పొందిన కంపెనీలలో క్షమా జనరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ యాక్సెస్ లైఫ్, అకో లైఫ్ ఉన్నాయి. కొత్త కంపెనీల చేరికతో ఇప్పుడు దేశంలో జీవిత బీమా వ్యాపారంలో 25, సాధారణ బీమా రంగంలో 34 కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్త కంపెనీలు లైసెన్స్ పొందిన తర్వాత బీమా కంపెనీల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగి 70కి చేరుకుంటుంది.

ప్రస్తుతం దేశంలో బీమా ప్రధాన వ్యాపారం నగరాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దీని విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. నిజానికి బీమా కంపెనీలు ప్రస్తుతం విక్రయిస్తున్న ఉత్పత్తులను పట్టణ ప్రాంతాల ప్రజలకు అనుగుణంగా రూపొందించారు. ప్రస్తుతం ఉన్న బీమా ఉత్పత్తులు సామాన్య ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయి. ఈ ఉత్పత్తులు సామాన్యులకు అందుబాటులో ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణం. సహజంగానే 2047 నాటికి ‘అందరికీ బీమా’ లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలో బీమా పరిశ్రమ పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారతీయ బీమా పరిశ్రమ ప్రపంచంలో 10వ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో దాదాపు రూ.57,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఉన్నాయి. 2027 నాటికి దేశీయ బీమా మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని IRDA అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

దీని వల్ల ఏం లాభం ఉంటుంది?

ఇన్సూరెన్స్ రంగంలోకి కొత్త కంపెనీలు పెద్ద సంఖ్యలో ప్రవేశించడం వల్ల మార్కెట్‌లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ రాహుల్ శర్మ అంటున్నారు. ఇది బీమా కస్టమర్ల కోసం కొత్త, ఆకర్షణీయమైన ఉత్పత్తులను తీసుకురావడానికి కంపెనీల మధ్య పోటీని సృష్టిస్తుంది. దీనితో పాటు, కంపెనీలు బీమా ప్రీమియం రేట్లను కూడా తగ్గించవచ్చు. ఇది ఎక్కువ మందిని బీమా తీసుకునే విధంగా ఆకర్షిస్తుంది. ఎలాంటి ఇన్సూరెన్స్‌ ముఖ్యం, ఇన్సూరెన్స్‌ వల్ల ఎలాంటి ఉపయోగాలు అనే అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న దిగ్గజాల ఆధిపత్యానికి తెరపడనుంది. బీమా పరిశ్రమ పరిధిని విస్తరించడం వల్ల కంపెనీలు దేశవ్యాప్తంగా తమ కార్యాలయాలను తెరిచి తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవడం మరో ప్రధాన ప్రయోజనం అని శర్మ చెప్పారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి