AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పావలా కోడికి.. బారాణా మసాలా! రూ.1 నాణెం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? త్వరలోనే బ్యాన్‌?

ఒక రూపాయి నాణెం తయారీ వ్యయం దాని ముఖ విలువ కంటే ఎక్కువ. దీంతో భారత ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, రూ.1 నాణెం ఉత్పత్తికి రూ.1.11 ఖర్చవుతుంది, 11 పైసల నష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థిక నిపుణులు దీని ఉత్పత్తిని నిలిపివేయాలని సూచిస్తున్నారు.

పావలా కోడికి.. బారాణా మసాలా! రూ.1 నాణెం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? త్వరలోనే బ్యాన్‌?
1 Rupee Coin
SN Pasha
|

Updated on: Nov 26, 2025 | 8:30 AM

Share

కొన్ని రోజుల్లో చిల్లర గలగలా వినిపించకపోవచ్చు. ఎందుకంటే ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ఒక రూపాయి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పావలా కోడికి.. బారాణా మాసాలా అన్న సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోయిన పోలిక రూపాయి నాణెం తయారీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం రూ.1 నాణెం ఉత్పత్తి చేయడానికి రూ.1.11 ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే రూ.1 నాణెంకు 11 పైసలు ప్రత్యక్ష నష్టం. దీంతో రూ.1 నాణెం తయారీని నిలిపివేస్తే మంచిదని అభిప్రాయం ఆర్థిక నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర కాయిన్స్‌ మాత్రం ప్రభుత్వానికి లాభదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే.. వాటి విలువ కంటే వాటి తయారీ ఖర్చు తక్కువ.

రూ.2 నాణెంకి రూ.1.28, రూ.5 నాణెం తయారీకి రూ.3.69, రూ.10 నాణెం తయారు చేయడానికి కేవలం రూ.5.54 మాత్రమే ఖర్చవుతుంది. వీటి తయారీతో ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఈ నాణేలన్నీ ముంబై, హైదరాబాద్, ఇతర నగరాల్లో ఉన్న ప్రభుత్వ మింట్లలో తయారు అవుతాయి. రూ.1 నాణెం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తున్నారు. ఇటీవలె అమెరికా పెన్నీ ఉత్పత్తిని ఖర్చు పెరుగుతుందని దాని ఉత్పత్తిని నిలిపివేసింది. అలాగే ఆర్బీఐ కూడా రూ.1 నాణెం ఉత్పత్తిని నిలిపివేస్తే బెటర్‌ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నోట్ల ముద్రణ లాభదాయకం

ప్రభుత్వానికి నాణేల కంటే నోట్ల ముద్రణ చాలా లాభదాయకం. ఆర్‌బిఐ డేటా ప్రకారం.. నోట్ల ముద్రణ ఖర్చు వాటి ముఖ విలువ కంటే చాలా తక్కువ. ఒక రూ.500 నోటు ముద్రించడానికి దాదాపు రూ.2.29 ఖర్చవుతుంది. ఒక రూ.200 నోటు ముద్రణకు దాదాపు రూ.2.37 ఖర్చవుతుంది. అలాగే రూ.100 నోటుకు రూ.1.77 మాత్రమే ఖర్చు అవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి