AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“కెరీర్ ప్లాన్ చేయ‌ను, నిజాయితీగా ప‌ని చేస్తా”

కెరీర్‌కు సంబంధించి ఏ రంగంలోనైనా లాంగ్ ట‌ర్మ్ ప్లానింగ్స్ వ‌ర్క‌వుట్ అవుతాయ్ కానీ, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆ ప‌ద్దతి కుద‌రద‌ని చెబుతోంది హీరోయిన్ పాల్ రాజ్‌పూత్‌.

కెరీర్ ప్లాన్ చేయ‌ను, నిజాయితీగా ప‌ని చేస్తా
Ram Naramaneni
|

Updated on: Sep 06, 2020 | 11:02 AM

Share

కెరీర్‌కు సంబంధించి ఏ రంగంలోనైనా లాంగ్ ట‌ర్మ్ ప్లానింగ్స్ వ‌ర్క‌వుట్ అవుతాయ్ కానీ, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆ ప‌ద్దతి కుద‌రద‌ని చెబుతోంది హీరోయిన్ పాల్ రాజ్‌పూత్‌. తన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’తోనే కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపిన‌ ఈ హాట్ బ్యూటీ.. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాలతో అల‌రించింది. మరి నటిగా మీ గోల్స్ ఏంట‌ని ప్రశ్నిస్తే.. విభిన్న పాత్రలతో మెప్పించాలనే అనుకుంటున్నా తప్ప, స్పెష‌ల్‌గా ఎలాంటి లాంగ్ ట‌ర్మ్ గోల్స్ పెట్టుకోలేద‌ని బదులిచ్చింది.

“మిగతా రంగాలతో పోల్చితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చాలా భిన్నమైనది. సంవ‌త్స‌రంలో త్వ‌ర‌త్వ‌ర‌గా ఐదారు సినిమాలు చేసేయాలి. ఫలానా టాప్ హీరోతో న‌టించాల‌నే గోల్స్ పెట్టుకోకూడ‌దు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అన్నింటికీ రెడీగా ఉండాలి. అన‌వ‌స‌రంగా ప‌రుగులు పెట్ట‌కూడ‌ద‌ని నాకు నేను ఎప్పుడూ చెప్పుకుంటా. ఇప్పుడున్న ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టూ పైకి ఎదగాలి. ప్ర‌జంట్ ఆనందంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తా. చేస్తున్న పని పట్ల పూర్తి నిజాయితీతో, నిబద్దతతో వ్యవహరిస్తూ ముందుకెళ్తే చాలు. అప్పుడు మంచి భ‌విష్య‌త్ మనకు ఆటోమేటిక్‌గా వ‌చ్చేస్తుంది” అని చెప్పింది పాయల్‌.

Also Read :

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు

Follow Us
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..