AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 Asia Cup 2026: సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!

అండర్-19 ఆసియా కప్ 2026 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఉత్తరాఖండ్ ఆటగాడు లక్ష్య రైచందానీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

U19 Asia Cup 2026: సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
U19 Asia Cup 2026
Venkata Chari
|

Updated on: Oct 30, 2026 | 3:58 PM

Share

2026 అండర్-19 ఆసియా కప్ (U19 Asia Cup 2026) కోసం భారత జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 30న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య రైచందానీ (Lakshya Raichandani) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ (Yashbardhan Singh Chauhan) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

లక్ష్య రైచందానీ ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19 (Australia U19) జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో లక్ష్య 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ జట్టులో మాజీ భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు కూడా చోటు దక్కించుకున్నారు. ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag), అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) గతంలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన సిరీస్‌కు ఎంపికయ్యారు. ఇప్పుడు ఆసియా కప్ జట్టులోనూ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడిన 15 మందిలో 13 మంది ఆటగాళ్లు ఆసియా కప్ జట్టులో చోటు నిలబెట్టుకోవడం విశేషం. అయితే చిగురుపాటి వెంకట (Chigurupati Venkata), రోహిత్ యాదవ్ (Rohit Yadav)కు ఈసారి చోటు దక్కలేదు. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉన్న ఆర్యన్ సావ్సాని (Aryan Savsani), ఇషాన్ సూద్ (Ishan Sood) కొత్తగా జట్టులోకి వచ్చారు.

భారత్ అండర్-19 జట్టు..

లక్ష్య రైచందానీ (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బాఘేల్ (వికెట్ కీపర్), వి. యశ్‌వీర్, ఆర్యన్ సావ్సాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షావిన్ వినోద్, ఇషాన్ సూద్.

నవంబర్ 8న పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్..

2026 అండర్-19 ఆసియా కప్‌లో భారత్ గ్రూప్-ఏలో ఉంది. పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19), యూఏఈ అండర్-19 (UAE U19), నేపాల్ అండర్-19 (Nepal U19) జట్లు ఇదే గ్రూపులో ఉన్నాయి.

నవంబర్ 6న నేపాల్‌తో మ్యాచ్‌తో భారత్ తన టోర్నీని ప్రారంభించనుంది. నవంబర్ 8న డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్‌తో తలపడుతుంది. నవంబర్ 10న యూఏఈతో లీగ్ దశ చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ జరగనున్నాయి.

సెహ్వాగ్, ద్రవిడ్ వారసులు ఒకే ఆసియా కప్ జట్టులో ఉండటంతో ఈసారి భారత అండర్-19 జట్టుపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Follow Us
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?