AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు.. 2028 నుంచి కొత్త రూల్స్‌

2028 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షల విధానంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త విధానం ప్రకారం గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్‌ అయినా.. అదనంగా ఎంచుకున్న స్కిల్‌ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే పాస్‌ అయినట్లుగా పరిగణిస్తారు. 2026-27లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ కొత్త విధానం వర్తించనుంది..

ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు.. 2028 నుంచి కొత్త రూల్స్‌
CBSE Announces Major Changes in Class 10
Srilakshmi C
|

Updated on: Oct 30, 2026 | 3:42 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 30: సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షల విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. 2027-28 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం.. విద్యార్థులు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతోపాటు అదనంగా ఒక నైపుణ్య ఆధారిత (స్కిల్‌) సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్‌ అయినప్పటికీ.. అదనంగా ఎంచుకున్న స్కిల్‌ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే పాస్‌ అయినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 29న స్పష్టత ఇచ్చింది. కొత్త విధానం ప్రకారం విద్యార్థులు రెండు భాషలు, గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం కలిపి ఐదు సబ్జెక్టులకు తప్పనిసరిగా బోర్డు పరీక్షలు రాయాలి. అయితే మొత్తం తొమ్మిది తప్పనిసరి పాఠ్యాంశాలను అభ్యసించాల్సి ఉంటుంది. వీటిలో మూడో భాష, కళా విద్య, శారీరక విద్య, ఆరోగ్యం, వృత్తి విద్య కూడా ఉంటాయి.

స్కిల్‌ సబ్జెక్టుతో ఉత్తీర్ణతకు అవకాశం

గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో విద్యార్థి ఫెయిల్‌ అయితే.. అదనంగా ఎంచుకున్న స్కిల్‌ సబ్జెక్టులో పాస్‌ కావడం ద్వారా ఉత్తీర్ణత సాధించవచ్చు. అయితే ఈ వెసులుబాటు బోర్డు గుర్తించిన స్కిల్‌ సబ్జెక్టులకు మాత్రమే వర్తిస్తుంది. కౌశల్‌ వికాస్‌ సబ్జెక్టుకు ఈ అవకాశం ఉండదు. వృత్తి విద్యను తప్పనిసరి పాఠ్యాంశంగా కొనసాగించనున్న సీబీఎస్‌ఈ.. విద్యార్థులకు రెండు మార్గాలను అందుబాటులో ఉంచింది. మొదటిది కౌశల్‌ వికాస్‌. దీన్ని ఎంచుకున్న విద్యార్థులకు పాఠశాల స్థాయిలో అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే పాఠశాల ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

రెండో మార్గంలో బోర్డు నోటిఫై చేసిన 22 నైపుణ్య ఆధారిత సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, హెల్త్‌కేర్‌ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సబ్జెక్టును ఎంచుకున్న విద్యార్థులు పదో తరగతిలో సంబంధిత బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉత్తీర్ణులైన వారికి మార్కుల జాబితాలో మార్కులు, గ్రేడ్లను నమోదు చేయడంతోపాటు నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌) కింద నైపుణ్య ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు. 2026-27 విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో కొన్ని మార్పులు వర్తించనున్నాయి. ఇందులో భాగంగా ‘ఇండివిడ్యూవల్స్‌ ఇన్‌ సొసైటీ’ అనే అంతరశాస్త్ర పాఠ్యాంశం, కంప్యూటేషనల్‌ థింకింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మాడ్యూళ్లు ఉండవని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే 2027-28లో పదో తరగతి చదివే ఈ బ్యాచ్‌కు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ కూడా వర్తించదు.

ఇవి కూడా చదవండి

ఎవరికి వర్తిస్తుంది?

ప్రస్తుతం (2026-27 విద్యాసంవత్సరం) తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2027-28లో పదో తరగతికి వెళ్లి 2028లో బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యార్థులకు మాత్రమే కొత్త విధానం వర్తిస్తుంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ మార్పులతో సంబంధం ఉండదని సీబీఎస్‌ఈ వెల్లడించింది. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించడంతోపాటు సాధారణ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా మార్చడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని బోర్డు వర్గాలు తెలిపాయి.

Follow Us
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?