Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్

దేశంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. దేశంలోని తాజా పరిస్థితిని సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్
Follow us
Rajesh Sharma

|

Updated on: May 01, 2020 | 7:25 PM

దేశంలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. మే నాలుగో తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని హోం శాఖ కాసేపటిక్రితం ప్రెస్ నోట్ జారీ చేసింది. దేశంలో తాజా పరిస్థితిని సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ పేర్కొంది.

మార్చి నెల ఆఖరు వారం నుంచి దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ చక్కటి ఫలితాలను ఇచ్చిందని, తాజాగా కరోనా వైరస్ ప్రభావం, ప్రమాదం ఇంకా తొలగి పోనందు వల్ల లాక్ డౌన్‌ను మరి కొంత కాలం పొడిగించాల్సిన అవసరం కనిపిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే మే నాలుగో తేదీ నుంచి మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగిస్తామని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు అంటే మే 17వ తేదీ వరకు పొడిగించిన హోం శాఖ కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రెడ్ జోన్లలో కచ్చితమైన ఆంక్షలను అమలు చేయడంతోపాటు.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా వైరస్ వున్న ప్రాంతాలను క్లియర్‌గా మార్కేషన్ చేసి, ఆ ప్రాంతాలలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా హోం శాఖ రాష్ట్రాలకు విడుదల చేసింది.

మోదీ ఎగ్జిట్ ప్లాన్ ఇదే.. సెప్టెంబర్ దాకా..!

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం