AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం

లాక్ డౌన్ ఆంక్షలను సడలించే ఈ దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో మొదటిది స్టెప్‌గా దేశాన్ని వివిధ జోన్ల కింద వర్గీకరించింది. ముఖ్యంగా రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. అయితే రెడ్ జోన్ల పరిధిలోను,

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం
Rajesh Sharma
|

Updated on: May 01, 2020 | 7:23 PM

Share

లాక్ డౌన్ ఆంక్షలను సడలించే ఈ దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో మొదటిది స్టెప్‌గా దేశాన్ని వివిధ జోన్ల కింద వర్గీకరించింది. ముఖ్యంగా రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. అయితే రెడ్ జోన్ల పరిధిలోను, వాటి చుట్టూతా కొంత కాలం పాటు గట్టి నిఘా ఉంచుతున్నట్లు, కఠినమైన పరీక్షలను కొనసాగించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ముఖ్యంగా రెడ్ జోన్ల విషయంలో విషయంలో వచ్చే రెండు నెలలపాటు నిశితమైన నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచించింది. రెడ్ జోన్ల నుంచి ఎవరు బయటకు రాకుండా పక్కా చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేయబోతోంది.

రెడ్ జోన్‌ల చుట్టూ బఫర్ జోన్ మార్ఫింగ్ చేయాలని హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి కరోనా వైరస్ లేని ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా ఖచ్చితమైన ఆంక్షలను పాటించేలా బఫర్ జోన్ మార్ఫింగ్ జరపడంతో పాటు కఠినమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని హోంశాఖ రాష్ట్రాల డీజీపీలకు సూచనలు చేస్తోంది.

రెడ్ జోన్లు, బఫర్ జోన్ల ప్రాంతాలలో విస్తృత స్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. కంటైన్మెంట్ డీమార్కేషన్ నిబంధనలను హోం శాఖ వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో రెసిడెన్షియల్ కాలనీలు, మొహల్లాలు, మునిసిపల్ వార్డులు, పోలీస్ స్టేషన్ పరిధులు, మునిసిపల్ టౌన్లుగా విభజించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధులు, గ్రామ పంచాయతీల పరిధులను విభజించాలని తెలిపింది.

మోదీ ఎగ్జిట్ ప్లాన్ ఇదే.. సెప్టెంబర్ దాకా..!

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్