AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యసేతు యాప్‌తో ప్రమాదం.. ఓవైసీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా విపరీతంగా జనాదరణ పొందుతున్న ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై రాజకీయ దుమారం రాజుకుంటోంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ ఒక చీకటి యాప్ అని అభివర్ణించారు

ఆరోగ్యసేతు యాప్‌తో ప్రమాదం.. ఓవైసీ హెచ్చరిక
Rajesh Sharma
|

Updated on: May 02, 2020 | 5:51 PM

Share

దేశవ్యాప్తంగా విపరీతంగా జనాదరణ పొందుతున్న ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై రాజకీయ దుమారం రాజుకుంటోంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ ఒక చీకటి యాప్ అని అభివర్ణించారు. ఈ యాప్ ద్వారా.. దాన్ని వినియోగించే వారి డేటా లీకయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న కరోనా వైరస్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చప్పట్లతోను, దీపాలతోను.. చివరికి ఏ మాత్రం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌తోను ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని అసదుద్దీన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

అయితే అసదుద్దీన్ నేరుగా ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ప్రభుత్వం పేరును ప్రస్తావించకుండా.. కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ సుల్తానులుగా అభివర్ణించడం విశేషం. ఆరోగ్యశ్రీ సేతు యాప్‌ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని, అది వారి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ఓవైసీ వాదిస్తున్నారు.

Follow Us
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..