ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. శాసన మండలికి ఎన్నికలు జరగకపోతే తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని భయపడిన ఉద్ధవ్ థాకరేకు అనుకూలంగా స్పందించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు శుక్రవారం ఈసీ తన అభిప్రాయం తెలిపింది.

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్
Follow us

|

Updated on: May 01, 2020 | 7:33 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. శాసన మండలికి ఎన్నికలు జరగకపోతే తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని భయపడిన ఉద్ధవ్ థాకరేకు అనుకూలంగా స్పందించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు శుక్రవారం ఈసీ తన అభిప్రాయం తెలిపింది.

మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు ఎన్నికలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దాంతో రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి జరిపిన టెలిఫోన్ సంభాషణ ఫలించినట్లు అయింది.

మే 29 తేదీ నాటికి ఉద్ధవ్ థాకరే రాష్ట్రంలోని ఉభయ చట్టసభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన మన తప్పు కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు.. కనీసం గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యేందుకు ఉద్ధవ్ థాకరే చేసిన ప్రయత్నాలకు మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్. కోషోయారి మోకాలడ్డారు. రెండుసార్లు గవర్నర్ కోటాలో తనను నామినేట్ చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేసి మరీ గవర్నర్‌కు పంపినా ఆయన ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో కంగారు పడిన ఉద్ధవ్ థాకరే.. 2 రోజుల క్రితం తన రాజకీయ భేషజాలు పక్కన పెట్టి మరీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

ఉద్ధవ్ థాకరే మంత్రాంగం ఫలించడంతో గవర్నర్ కౌన్సిల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ఆమోదం తెలిపిన మరునాడే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని ప్రకటించింది. దాంతో మే 29 లోగా శాసన మండలికి ఎన్నికయ్యే అవకాశం ఉద్ధవ్ థాక్రేకు దక్కినట్లయింది.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం