హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని పకడ్బందీ చర్యలకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ సోకి సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు పరచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్
Follow us
Rajesh Sharma

|

Updated on: May 01, 2020 | 7:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని పకడ్బందీ చర్యలకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ సోకి సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు పరచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని, నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు.

కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేల 792 మందిలో 17 వేల 585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన వారికి కూడా రెండు, మూడు రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తామని వారు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఈ 32 వేల 792 మందిలో నాలుగు వేల మంది హైరిస్క్ జోన్‌లో ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. వీరందరికీ ప్రాధాన్యతతో పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించడం తోపాటు వెంటనే క్వారెంటైన్‌కు లేదా ఐసొలేషన్ వార్డులకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

హైరిస్క్‌లో ఉన్న వారికి ప్రత్యేక నెంబర్లు కేటాయిస్తామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. టెలీ మెడిసిన్, విలేజ్ క్లినిక్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల మధ్య సరైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థ తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. టెలీ మెడిసిన్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పొందడం, అక్కడి నుంచి నేరుగా విలేజ్ క్లినిక్ల్స్ ద్వారా మందులు సరఫరా చేయడం జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.

!

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం