డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం

ప్రభుత్వాలు, పోలీసులు, సామాజిక వేత్తలు, మీడియా ఎంత చెబుతున్నా కూడా పోకిరీల ఆగడాలు ఆగడం లేదు. వైద్యులపై దాడులు నిలిచిపోవడం లేదు. తాజాగా విజయవాడలో అర్ధరాత్రి వైద్య బృందంపై దాడికి తెగబడిన పోకిరీల ఉదంతం వెలుగు చూసింది.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:29 PM

ప్రభుత్వాలు, పోలీసులు, సామాజిక వేత్తలు, మీడియా ఎంత చెబుతున్నా కూడా పోకిరీల ఆగడాలు ఆగడం లేదు. వైద్యులపై దాడులు నిలిచిపోవడం లేదు. తాజాగా విజయవాడలో అర్ధరాత్రి వైద్య బృందంపై దాడికి తెగబడిన పోకిరీల ఉదంతం వెలుగు చూసింది. జూనియర్ డాక్టర్లపై దాడి చేయడంతో పాటు వారి వాహనాన్ని కూడా తగలబెట్టిన ఉదంతం ఇది.

విజయవాడ ప్రసాదంపాడులో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. గురువారం అర్ధరాత్రి ఈ గంజాయి బ్యాచ్ వైద్య బృందంపై దాడికి దిగింది. అడ్డుకోబోయిన ఓ వైద్యుని బైక్ దగ్ధం చేశారు. మరో వైద్యుని కారు అద్దాలను ధ్వంసం చేయడంతో ఆయన కారును వేగంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు.

విజయవాడ రూరల్ మీడియాకు చెందిన ప్రసాదంపాడులో గంజాయి సేవిస్తున్న యువకులు స్థానికులపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. స్థానికంగా ఉంటున్న జూనియర్ డాక్టర్లు విధులు ముగించుకుని వస్తున్న సమయంలో వారితో వాగ్వివాదానికి దిగింది గంజాయి బ్యాచ్. మాటా మాటా పెరగడంతో దాడికి తెగబడ్డారు.

గంజాయి బ్యాచ్ ఆగడాలతో ప్రసాదంపాడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య బృందం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బైకును తగులబెట్టిన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu