గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

రెండో విడత లాక్‌డౌన్‌ మే 3వ తేదీ ఆదివారంతో ముగియనుంది. మరి ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉంటుందా? ఉండదా? ఈ అనుమానం అందరిలోనూ ఉంది. కేంద్రం మాత్రం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసింది. గ్రీన్‌జోన్‌లలో మాత్రమే సడలింపులు ఉంటాయని. కేంద్రమంత్రులు హర్షవర్దన్, అమిత్ షా, కిషన్ రెడ్డి తదితరులు వేర్వేరు సందర్భాలలో గ్రీన్ జోన్లలో మాత్రమే సడలింపులుంటాయని చెప్పుకొచ్చారు.

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ
Follow us

|

Updated on: May 01, 2020 | 7:29 PM

రెండో విడత లాక్‌డౌన్‌ మే 3వ తేదీ ఆదివారంతో ముగియనుంది. మరి ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉంటుందా? ఉండదా? ఈ అనుమానం అందరిలోనూ ఉంది. కేంద్రం మాత్రం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసింది. గ్రీన్‌జోన్‌లలో మాత్రమే సడలింపులు ఉంటాయని. కేంద్రమంత్రులు హర్షవర్దన్, అమిత్ షా, కిషన్ రెడ్డి తదితరులు వేర్వేరు సందర్భాలలో గ్రీన్ జోన్లలో మాత్రమే సడలింపులుంటాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే దేశంలో జిల్లాల వారీగా జోన్లను విభజించే పనిని కేంద్ర హోం శాఖ వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలను కూడా జోన్ల వారీగా విభజించింది.

కేంద్రం జిల్లాల వారీగా జోన్‌లను విభజించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయనగరం ఒక్కటే గ్రీన్‌జోన్‌లో ఉంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించింది కేంద్రం. ఇక ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, తొమ్మిది జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.. హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించింది కేంద్రం. నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, కొమ్రం భీమ్‌, ఆసిఫాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, జయశంకర్‌భూపాలపల్లి, మెదక్‌, జనగాం, నారాయణపేటలు ఆరెంజ్‌జోన్‌లో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలను గ్రీన్‌జోన్‌లుగా ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ లేఖ రాశారు. గతంలో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్పులు చేసినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూడాన్‌ వెల్లడించారు. కొత్త జాబితా ప్రకారం రెడ్‌ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్‌ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 19 జిల్లాలు, మహారాష్ట్రలో 14, తమిళనాడులో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

సోమవారం (మే నాలుగో తేదీ) నుంచి గ్రీన్ జోన్లలో దాదాపు సాధారణ జీవనం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ జోన్లలోని జిల్లాల్లో మత సంబంధమైన సదస్సులకు, సామూహిక ప్రార్థనలకు, సినిమా హాళ్ళకు, మాల్స్‌కు అనుమతినిచ్చే విషయంలో కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. ఆరెంజ్ జోన్లలో కేవలం దుకాణాలు తెరుచునేందుకు, ఆన్‌లైన్ ఆర్డర్లకు మాత్రమే అనుమతినిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రెడ్ జోన్లలో మాత్రం పకడ్బందీ ఆంక్షలను మరో నెల రోజులైనా కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ