మందుబాబులకు త్వరలో షాక్.. కెసీఆర్ ఏం చేయబోతున్నారంటే ?

మందుబాబులకు షాకిచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ముందుండడంతో నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ కెసీఆర్ ఏ విషయంలో మందుబాబులకు షాకివ్వబోతున్నారు ? రీడ్ దిస్ స్టోరీ తెలంగాణలో ఎక్సైజ్ ఆదాయం బాగానే వుంది. దాన్ని మరింతగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన 73 మునిసిపాలిటీల్లో బార్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు […]

మందుబాబులకు త్వరలో షాక్.. కెసీఆర్ ఏం చేయబోతున్నారంటే ?
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 19, 2019 | 2:06 PM

మందుబాబులకు షాకిచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ముందుండడంతో నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ కెసీఆర్ ఏ విషయంలో మందుబాబులకు షాకివ్వబోతున్నారు ? రీడ్ దిస్ స్టోరీ

తెలంగాణలో ఎక్సైజ్ ఆదాయం బాగానే వుంది. దాన్ని మరింతగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన 73 మునిసిపాలిటీల్లో బార్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు రెడీ అయ్యాయి. దాంతో పాటు మరో నిర్ణయం తీసుకోవడం ద్వారా అదనంగా 1300 నుంచి 1700 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ రాబడిని పెంచడానికి ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. దీంట్లో భాగంగా సిద్దమైన ఫైల్ ఇప్పుడు కెసీఆర్ ముందున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలలో భాగంగా మద్యం ధరలను పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించాలని కెసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. సబ్‌కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసులతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

అయితే మద్యం ధరల పెంపు ప్రతిపాదనపై నిర్ణయానికి, మునిసిపల్ ఎన్నికలకు ముడిపడి వుందని తెలుస్తోంది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే పలు రకాల లిక్కర్ ధరలను పది శాతం వరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఏటా 1300-1700 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను బట్టి మద్యం ధరల సవరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత లిక్కర్ ధరలను పెంచాలని, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీలో ఆలస్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా తెలంగాణలో ఏర్పాటైన 73 కొత్త మున్సిపాలిటీల పరిధిలో కూడా బార్ల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్‌ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త మునిసిపాలిటీల్లో బార్ల ఏర్పాటు ద్వారా లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సో.. మొత్తానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న తెలంగాణ ఖజానాకు మద్యం ద్వారా ఆదాయం రానుందన్నమాట.