బ్రేకింగ్: ఎట్టకేలకు దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి!
ఎట్టకేలకు ఆర్టీసీ నేతలు దీక్ష విరమించారు. అఖిలపక్షం సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి , రాజిరెడ్డిలు దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు తెజస అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. శనివారం తన నివాసంలో దీక్ష ప్రారంభించిన అశ్వత్థామరెడ్డిని పోలీసులు బలవంతంగా ఆదివారం […]
ఎట్టకేలకు ఆర్టీసీ నేతలు దీక్ష విరమించారు. అఖిలపక్షం సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి , రాజిరెడ్డిలు దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు తెజస అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. శనివారం తన నివాసంలో దీక్ష ప్రారంభించిన అశ్వత్థామరెడ్డిని పోలీసులు బలవంతంగా ఆదివారం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన వినకుండా కొనసాగించారు.