జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. బీజేపీతో ఇక ఢీ అంటే ఢీ.. డిసెంబర్‌లో కీలక భేటీ
బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న గులాబీ దళపతి ఆ పార్టీతో ఇక ఢీ అంటే ఢీ అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూటమి కడతానని కేసీఆర్ మరోసారి ప్రకటించారు.
KCR to focus on national politics: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మరోసారి జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. బీజేపీ వంచన రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బీజేపీపై యుద్ధం ప్రకటిస్తానని అన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత.. బీజేపీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన బీజేపీ విధానాలను ఎండగట్టారు. మోదీ ప్రభుత్వ విధానాలను తప్పు పట్టారు. తాను ఇదివరకే పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడానని, వారిలో పలువురు సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను మాట్లాడిన నేతల్లో.. కుమార స్వామి, శరద్ పవర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్, పినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ వున్నారని తెలిపారు.
మిగతా పార్టీల నాయకులతో త్వరలోనే మాట్లాడతానని, డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్‌లోనే ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని అంటున్నారు కేసీఆర్. ‘‘ మన దేశ జీడీపీ.. శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది.. ఇలాగే కొనసాగితే నేపాల్ కంటే కూడా తక్కువకు వెళ్తాము.. బీజేపీ వంచన పార్టీ… దేశ సంపాదన సృషించాల్సిపోయి అమ్ముతున్నాడు… బీజేపీపై ఇక యుద్ధమే.. 7 ఏళ్ళుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య రాలేదు. బీజేపీ ఇప్పుడు కుట్రలు చేస్తుంది.. ’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం
ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్
ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం
ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ