సిగ్న‌ల్‌ రావాలంటే డాబా, వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాల్సిందేనా..? ఇక ఆ అవసరం లేదంటోంది ఎయిర్‌టెల్‌

ఒకవైపు భారతదేశం మొత్తం 3జీ, 4జీ నెట్వర్క్‌లతో ప్రయాణం చేస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో సెల్‌ సిగ్న‌ల్‌ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సిగ్న‌ల్‌ రావాలంటే డాబా, వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాల్సిందేనా..? ఇక ఆ అవసరం లేదంటోంది ఎయిర్‌టెల్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 18, 2020 | 5:42 PM

ఒకవైపు భారతదేశం మొత్తం 3జీ, 4జీ నెట్వర్క్‌లతో ప్రయాణం చేస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో సెల్‌ సిగ్న‌ల్‌ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్న‌ల్‌ కోసం చిన్నారులు, వాటర్‌ ట్యాంక్‌లు, భవనాలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నేఫద్యంలో విద్యా శాఖ ఆన్ లైన్‌ తరగతులను నిర్వహిస్తోంది. దీంతో ఆ తరగతుల పుణ్యమా అని పిల్లలు చెట్టూ, పుట్టల్లో సంచరిస్తున్నారు. భవనాలు ఎక్కుతూ ప్రమాద పుటంచున ప్రయాణం చేస్తు న్నారు. అంతేకాదు ప్రతి నెల రేషన్‌ కోసం, పింఛన్ల లబ్దిదారులు కూడా సిగ్న‌ల్‌ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి సమస్యలకు తావులేదంటోంది ఎయిర్‌టెల్‌.

భారతీ ఎయిర్‌టెల్‌ తాము సేవలు అందిస్తున్న 10 టెలికాం సర్కిళ్లలో భవనాల లోపలా మొబైల్‌ మాటలు స్పష్టంగా వినపడేలా, డేటా వేగం బాగుండేలా కవరేజీని విస్తృతం చేయనుంది. ఇందుకోసం 900 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో 4జీ సాంకేతికతను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాండ్‌ను ప్రస్తుతం 2జీ సేవల కోసం కంపెనీ వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఈ బ్యాండ్‌ను పునః వ్యవస్థీకరించి 4జీ సేవలను విస్తరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ దేశవ్యాప్తంగా 3జీ మౌలిక వసతులను 4జీకి అనుగుణంగా మార్పిడి చేసినట్లు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ఈ మార్పిళ్ల కారణంగా భవనాలు, అపార్ట్‌మెంట్లలోపల కూడా మొబైల్‌ సిగ్నళ్లు బలంగా రావడానికి వీలు కలుగుతుంది. అయితే, ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్‌ ఇంకా స్పందించలేదు.

రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ