వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. ఏడాదంతా తీరిక లేని క్రికెట్.. ఫ్యాన్స్‌కు పండగే పండగ

కరోనా పుణ్యమాని 2020 సంవత్సరంలో ఐపీఎల్ మినహా క్రికెట్ మజాను మిస్సయిన సగటు అభిమానులకు ఇది గుడ్ న్యూస్. 2020 తొలి నాళ్ళలో ఒక సిరీస్ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ టోర్నీ దాకా క్రికెట్‌ను మిస్సయిన అభిమానులు వచ్చే….

  • Rajesh Sharma
  • Publish Date - 2:18 pm, Wed, 18 November 20

Team India busy next year: కరోనా పుణ్యమాని 2020 సంవత్సరంలో ఐపీఎల్ మినహా క్రికెట్ మజాను మిస్సయిన సగటు అభిమానులకు ఇది గుడ్ న్యూస్. 2020 తొలి నాళ్ళలో ఒక సిరీస్ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ టోర్నీ దాకా క్రికెట్‌ను మిస్సయిన అభిమానులు వచ్చే సంవత్సరం అంటే 2021 అంతా క్రికెట్ ఆటను ఆస్వాదించేలా షెడ్యూల్ ప్రిపేరయ్యింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో వున్న టీమిండియా డిసెంబర్ జనవరి రెండో వారంలో తిరిగి రాగానే ఏడాదంతా తీరిక లేకని సిరీస్‌లు, టోర్నీలు ఆడబోతోంది.

స్వదేశానికి రాగానే భారత పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడనున్నది టీమిండియా. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో నాలుగేసి టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే 2021 ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నది. జూన్‌లో శ్రీలంకకు భారత్ జట్టు పయనమవుతుంది. అక్కడ 3 వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు అడనున్నది టీమిండియా.

జూన్, జులై నెల్లలో టీ20 ఆసియా కప్ జరగబోతోంది. ఇందులో భారత జట్టు మొత్తం ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఆ తర్వాత జులై నెలలోనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళుతుంది. అక్కడ మూడు వన్డే మ్యాచ్‌లు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ్నించి రాగానే జులై నెలాఖరు నుంచి సెప్టెంబర్ దాకా టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడబోతోంది. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా సౌతాఫ్రికాతో సిరీస్ ఆడనున్నది. దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది.

సౌతాఫ్రికా జట్టు పర్యటన ముగిసిన వెంటనే స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పాల్గొంటుంది. ఈ టోర్నీ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్నది. ఆ తర్వాత న్యూజీలాండ్ జట్టు భారత పర్యటనకు రానుండగా.. కివీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడబోతోంది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో భారత జట్టు సౌతాఫ్రికా పర్యటను వెళ్ళి మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడబోతోంది. మొత్తానికి 2021 సంవత్సరమంతా ఎడతెరిపి లేని క్రికెట్‌ను ఆస్వాదించే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనున్నది.

ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్

ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం