AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు.. నమ్మకంగా ఉంటూనే నట్టేట్ట ముంచాడు.. అవమాన భారంతో యజమాని చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు

సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సంబంధించిన అత్యంత కీలకమైన డేటాను లీక్‌ చేసి.. ఆ కంపెనీ యజమాని ఆత్మహత్యకు కారణమయ్యాడు.

అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు.. నమ్మకంగా ఉంటూనే నట్టేట్ట ముంచాడు.. అవమాన భారంతో యజమాని చావుకు కారణమైన వ్యక్తి అరెస్టు
Balaraju Goud
|

Updated on: Nov 18, 2020 | 6:17 PM

Share

సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సంబంధించిన అత్యంత కీలకమైన డేటాను లీక్‌ చేసి.. ఆ కంపెనీ యజమాని ఆత్మహత్యకు కారణమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో పనిచేసి వచ్చిన అశోక్‌వర్మ, సుధీర్‌వర్మ మాదాపూర్‌ మైండ్‌స్పే్‌సలో రిపోర్ట్‌ గార్డెన్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించారు. పలువురు ఉద్యోగులను నియమించుకుని వివిధ కంపెనీలకు సేవలందిస్తున్నారు. వీరిలో మియాపూర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ నమ్మకంగా, క్రమశిక్షణతో పనిచేస్తుండడంతో.. అతనికి కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అశోక్‌వర్మ, సుధీర్‌వర్మ కంపెనీ విస్తరణలో భాగంగా ప్రస్తుత సంస్థను ఇతరులకు విక్రయించే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న హుస్సేన్‌.. కంపెనీని ఇతరులకు విక్రయిస్తే.. నెలకు లక్షకు పైగా జీతం వచ్చే తన ఉద్యోగానికి భద్రత ఉండదనే కుట్రలు పన్నాడు. ఇదే క్రమంలో కంపెనీకి చెందిన డేటాను మాజీ ఉద్యోగుల మెయిల్స్‌ ద్వారా లీక్‌ చేశాడు. అమెరికాలో ఉన్న అశోక్‌ వర్మకు విషయం తెలియడంతో.. తాము పడ్డ కష్టమంతా వృథా అయిందనే బాధతో అశోక్‌వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మరోవైపు కంపెనీ డేటా లీకయిందన్న అనుమానంతో మరో అధినేత సుధీర్‌వర్మ ఆఫీసు కంప్యూటర్లను పరిశీలించగా.. అది హుస్సేన్‌ పని అని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హుస్సేన్‌ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్