ఈ వేడుకలకు నేను దూరం

ఈ వేడుకలకు నేను దూరం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నెల 17న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ నిర్వహించొద్దని ఈ మేరకు సీఎం టీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం నిభ్రాంతిలో ఉన్న ఈ సమయంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 8:25 PM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నెల 17న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ నిర్వహించొద్దని ఈ మేరకు సీఎం టీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం నిభ్రాంతిలో ఉన్న ఈ సమయంలో నేను పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం సరి కాదని అన్నారు సీఎం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu