AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఖరి నిమిషంలో వరునికి షాకిచ్చిన వధువు

ప్రేమో.. పెళ్ళో.. లేక ఇంకేదో కానీ అదేదో ముందే చెబితే పాపం ఆ వరునికి పరువైనా దక్కేదేమో.. ఇవేవీ ఆలోచించని ఓ వధువు.. ఆఖరి నిమిషంలో షాకిచ్చిందో వరునికి. అంతా ఓకే అనుకుని..

ఆఖరి నిమిషంలో వరునికి షాకిచ్చిన వధువు
Rajesh Sharma
|

Updated on: Oct 31, 2020 | 6:19 PM

Share

Bride shocks Bridegroom in last minute: ప్రేమో.. పెళ్ళో.. లేక ఇంకేదో కానీ అదేదో ముందే చెబితే పాపం ఆ వరునికి పరువైనా దక్కేదేమో.. ఇవేవీ ఆలోచించని ఓ వధువు.. ఆఖరి నిమిషంలో షాకిచ్చిందో వరునికి. అంతా ఓకే అనుకుని.. మరో నిమిషంలో తాళి కట్టేందుకు వరుడు రెడీ అవుతుండగా.. నాకీ పెళ్ళొద్దు బాబూ అంటూ ఏకంగా తాళిని అడ్డుకుందా వధువు. దీంతో నివ్వెరపోయిన వరుడు.. ఏమీ చేయలేక అక్కడ్నించి నిష్క్రమించగా.. బంధువులంతా తలొ దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఉదంతం తమిళనాడులో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..

సరిగ్గా తాళి కట్టే సమయంలో వరుడికి షాక్ ఇచ్చిందా వధువు. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.

బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అన్నది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది. ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుకనుండి వెళ్లిపోయాడు వరుడు. పెళ్లి ఆగిన తరువాత ఎంతసేపటికి ప్రియదర్శిని ప్రేమించిన వ్యక్తి రాకపోవడంతో వధువుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.

ALSO READ: మోదీకి జగన్ లేఖ.. నిధులివ్వకపోతే..!

ALSO READ: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్

ALSO READ: 60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ

Follow Us