60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర మైన అవినీతి ఆరోపణలు చేశారు... అదేంటి వారిద్దరి పార్టీలు కలిసే కదా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి.. అలాంటిది మోదీ ఎందుకు నితీశ్ కుమార్‌పై ఆరోపణలు చేస్తారు? అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం మోదీ.. నితీశ్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. రీడ్ దిస్...

60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ... నితీశ్‌పై మోదీ ధ్వజం!
Follow us

|

Updated on: Oct 31, 2020 | 5:00 PM

Sixty scams..Thirty thousand Crores loot: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ రక్తి కడుతోంది. తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మలివిడత ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు రెచ్చిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా బీహార్ రాష్ట్రాన్ని ఏలుతున్న నితీశ్ కుమార్‌ను ఎలాగైనా గద్దె దింపేందుకు విపక్ష ఆర్జేడీ నేతలు శ్రమిస్తున్నారు.

అన్ని రకాలుగా పాలక కూటమికే విజయావకాశాలున్నాయని చెప్పుకుంటున్న క్రమంలో గత ఎన్నికల ప్రచారాంశాలు పాలక కూటమి బీజేపీ-జేడీయూలకు ఇబ్బందికరంగా పరిణమించేలా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యూహం పన్నారు. గత ఎన్నికల్లో నితీశ్ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో మహాఘట్ బంధన్ పేరిట పోటీ చేశారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ అధినేతలు ప్రచారం చేశారు. అప్పటికే ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోదీ కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తూ.. నితీశ్ కుమార్‌పై తన ప్రచారంలో తరచూ విరుచుకు పడేవారు.

2015 ఎన్నికల ప్రచారంలో మోదీ.. నితీశ్ కుమార్ నుద్దేశించి చేసిన ప్రసంగాలలో కీలకాంశాలను ఒక్కటొక్కటే ఇపుడు వెలుగులోకి తేవడం ద్వారా అధికార కూటమి జేడీయూ-బీజేపీలను ఇరకాటంలోకి నెట్టేందుకు తేజస్వీయాదవ్ వ్యూహం పన్నారు. తాజాగా మోదీ 2015 ఎన్నికల ప్రచారంలో నితీశ్ పై చేసిన ఆరోపణల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు తేజస్వి. 2015 ప్రచార సభలో పాల్గొన్న మోదీ నితీశ్ కుమార్ 60 దాకా స్కాములు చేశారని, అందులో సుమారు 30 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనీ ఆరోపించారు.

మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన తేజస్వి.. నితీశ్ కుమార్‌పై తాము ఆరోపణలు చేస్తే రాజకీయమన్నారు.. మరి మోదీనే స్వయంగా నితీశ్ అవినీతి చరిత్రపై కామెంట్ చేశారంటూ చురకలంటించారు. గతంలో ప్రత్యర్థులుగా వున్న సమయంలో పరస్పరం చేసుకున్న ఆరోపణలు, విమర్శలే ఇపుడు బీహార్ ఎన్నికల ప్రచారంలో అధికార కూటమికి ఇబ్బందికరంగా మారాయనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది.

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ