బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!

సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్‌ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది భారత్. బుధవారం నిర్వహించిన ఈ పరీక్షలో మిసైల్ రేంజ్‌ని మార్చి మరీ విజయవంతంగా పరీక్షించడం విశేషం.

బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!
Follow us

|

Updated on: Sep 30, 2020 | 4:59 PM

Brahmos missile test fired successfully: సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్‌ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది భారత్. బుధవారం నిర్వహించిన ఈ పరీక్షలో మిసైల్ రేంజ్‌ని మార్చి మరీ విజయవంతంగా పరీక్షించడం విశేషం. ఆధునీకరించిన ఈ బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణి 400 కిలో మీటర్ల లక్ష్యాలను ఛేదించగలదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఒడిశా నుంచి బ్రహ్మోస్‌ను విజయవంతంగా ప్రయోగించారు.

బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బ‌ృందాన్ని అభినందించిన డీఆర్డీవో ఛైర్మెన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ భారత సైనిక పాటవానికి అదనపు బలం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ పరిశోధనలలో భాగంగా పీజే-10 ప్రాజెక్టు కింది ఈ సూపర్ సోనిక్ క్షిపణిని రూపొందించారు.

ఒడిశాలోని ప్రయోగ కేంద్రం నుంచి టెస్టు ఫైర్ చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు. అలాగే సబ్ మెరైన్ల నుంచి, యుద్ధ నౌకల నుంచి, ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్ ప్రైజ్ ఎన్పీవో మషినోస్ట్రోనియల (ఎన్పీవోఎం)తో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా రూపొందించింది.

Also read:  ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట

Also read:    క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

Also read:    ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు