Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మండా సీజన్ 4 గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ కంటే రెండో సీజనే బెటర్ అని చెప్పుకొచ్చారు.

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2020 | 10:15 PM

Bigg Boss 4: బిగ్ బాస్ నాలుగో సీజన్ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు హౌస్‌లో జరిగిన విశేషాల కంటే.. వివాదాలు, గొడవలు గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. వన్‌సైడ్ లవ్ ట్రాకులు, ఇగోలు, చిన్న చిన్న మనస్పర్ధలతో హౌస్‌మేట్స్ ప్రతీ విషయానికి గొడవ పడుతూ వచ్చారు. దీనితో షో మొదటి రెండు వారాలు సోసోగానే గడిచింది. అంతేకాదు రెండు లేదా మూడు వారాల తర్వాత రావాల్సిన వైల్డ్ కార్డు ఎంట్రీలు మొదటి వారం నుంచే హౌస్‌లోకి అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు బిగ్ బాస్ ఎలిమేషన్ ప్రక్రియపై కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కుమార్ సాయి, దివి, దేవి నాగవల్లి ఎలిమినేషన్స్ అన్‌ఫెయిర్ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మండా సీజన్ 4 గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ కంటే రెండో సీజనే బెటర్ అని చెప్పుకొచ్చారు. ఈసారి అన్నీ కూడా పాత టాస్కులే పెడుతున్నారని.. కాస్త కొత్త టాస్కులు పెట్టాలని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేశారు. ఇక గతంలోని కొన్ని లవ్ ట్రాకులను ఈ సీజన్‌కు కూడా అప్లై చేయాలని చూశారని.. కానీ అవి ఫెయిల్ అయినట్లు ఉన్నాయని తెలిపారు. అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీ దానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతానికి అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ టాప్ 5లో ఉంటారని కౌశల్ జోస్యం చెప్పారు. మున్ముందు పరిణామాలు మారే అవకాశాలు లేకపోలేదని తెలిపారు. కాగా, ఈసారి సీజన్‌కు కూడా మహిళా విజేత ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..