బిగ్ బాస్ 4: సమంతా పారితోషికం ఎంతో తెలిస్తే.!
అక్కినేని నాగార్జున స్థానంలో బిగ్ బాస్ హోస్టుగా విచ్చేసిన సమంతా దసరా ఎపిసోడ్‌ను ఆసాంతం నవ్వులతో నింపేసింది. తనదైన శైలి మాటతీరుతో..
Bigg Boss 4: అక్కినేని నాగార్జున స్థానంలో బిగ్ బాస్ హోస్టుగా విచ్చేసిన సమంతా దసరా ఎపిసోడ్‌ను ఆసాంతం నవ్వులతో నింపేసింది. తనదైన శైలి మాటతీరుతో.. అప్పుడప్పుడు పంచ్‌లు వేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. ఇక ఆ ఎపిసోడ్‌లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, కమెడియన్ హైపర్ ఆది లాంటి సెలబ్రిటీలు ఆమెకు తమ వంతు సపోర్ట్‌ను అందించారు. దీనితో బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలోనే మిగతా వారాలు కూడా సమంతనే హోస్టింగ్ చేయమంటున్నారట షో నిర్వాహకులు.
‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం నాగార్జున ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన 21 రోజులు ఉండబోతున్నారు. అందుకే బిగ్ బాస్ బాధ్యతను కోడల పిల్ల సమంతపై వేశారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన దసరా ఎపిసోడ్ బిగ్ హిట్ అయింది. దీనితో మిగిలిన ఐదు ఎపిసోడ్లకు కూడా సమంతానే హోస్ట్‌గా కొనసాగించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకుగానూ బిగ్ బాస్ టీమ్ ఆమెకు రూ. 2.10 కోట్లు చెల్లిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు నాగార్జున రూ. 8 కోట్లు తీసుకుంటుంటే.. సమంత కేవలం మూడు వారాలకే రెండు కోట్లు పైగా పారితోషికం అందుకుంటోందట. మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం సామ్ పారితోషికంపైనే పెద్ద చర్చ జరుగుతోంది.
Also Read:
ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..