జమ్మూ కాశ్మీర్ లో కొత్త చట్టాలు, హురియత్ కాన్ఫరెన్స్ నిరసన
జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాల పట్ల ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 31 న పూర్తి బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. వీటిని అబ్దుల్ గని భట్, బిలాల్ ఘని లోనె, మస్రూర్ అబ్బాస్ వంటి నేతలు ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను బెదిరించడానికి, మానసికంగా వారిని వేధించడానికి ఈ విధమైన శాసనాలను తెస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని […]
జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాల పట్ల ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 31 న పూర్తి బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. వీటిని అబ్దుల్ గని భట్, బిలాల్ ఘని లోనె, మస్రూర్ అబ్బాస్ వంటి నేతలు ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను బెదిరించడానికి, మానసికంగా వారిని వేధించడానికి ఈ విధమైన శాసనాలను తెస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఎదుర్కొని తీరుతామని, పెద్దఎత్తున ఆందోళన చేస్తామని అబ్దుల్ గని భట్ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీరుపై ఏదో ఒక విధంగా పెత్తనం చలాయించడాన్ని తాము సహించబోమన్నారు.