సుశాంత్ సిస్టర్స్ ఫై ఎఫ్ఐఆర్ సరికాదు, సీబీఐ

సుశాంత్ కేసులో అతని సిస్టర్స్ పై రియా చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సరికాదని సీబీఐ తెలిపింది. ఇది చట్టప్రకారం సమంజసం కాదని బాంబే హైకోర్టుకు విన్నవించుకుంది.  ఆ సిస్టర్స్ పై రియా ఆరోపణలు ఊహాజనితంగా ఉన్నాయని, అసలు ఇవి తమ దర్యాప్తులో భాగంగా ఉండాలని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసులవద్ద గానీ, రియా వద్ద గానీ సమాచారం ఉంటే తమకు […]

సుశాంత్ సిస్టర్స్ ఫై ఎఫ్ఐఆర్ సరికాదు, సీబీఐ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 28, 2020 | 7:40 PM

సుశాంత్ కేసులో అతని సిస్టర్స్ పై రియా చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సరికాదని సీబీఐ తెలిపింది. ఇది చట్టప్రకారం సమంజసం కాదని బాంబే హైకోర్టుకు విన్నవించుకుంది.  ఆ సిస్టర్స్ పై రియా ఆరోపణలు ఊహాజనితంగా ఉన్నాయని, అసలు ఇవి తమ దర్యాప్తులో భాగంగా ఉండాలని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసులవద్ద గానీ, రియా వద్ద గానీ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని వారు అన్నారు. అంతే తప్ప బాంద్రా పోలీసు స్టేషన్ లో సుశాంత్ సిస్టర్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలన్న సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతూ సింగ్ అభ్యర్థనను వారు సమర్థించారు,