బిగ్‌బాస్-3 విన్నర్‌ను ప్రకటించబోయే.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో.. ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారంతోనే దీనికి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో అనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న జరిగిన ఎలిమినేషన్‌లో శివజ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే శివజ్యోతి ఔట్ అవ్వడంతో అలి రెజా సేఫ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో అయిదుగురు ఉన్నారు. అయితే […]
తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో.. ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారంతోనే దీనికి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో అనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న జరిగిన ఎలిమినేషన్‌లో శివజ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే శివజ్యోతి ఔట్ అవ్వడంతో అలి రెజా సేఫ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో అయిదుగురు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఫైనల్ టైటిల్ అందుకుంటారో వేచిచూడాలి. అయితే ఈ సీజన్ విన్నర్‌ను ఎవరు ప్రకటించబోతున్నారన్న దానిపై వార్తలు లీకయ్యాయి. గత సీజన్‌లో కూడా ఫైనల్ టైటిల్ ప్రకటించేందుకు స్టార్ హీరోలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సో ఈసారి కూడా ఇండస్ట్రీలోని అతి పెద్ద స్టార్ హీరోని ఈ గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నాగార్జున రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. నాగ్.. చిరూ.. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో నాగ్ ఆహ్వానాన్ని చిరు మన్నించి.. వచ్చేందుకు ఒప్పుకున్నారట. సో.. ఈ సీజన్3 లో విజేతను స్టేజిపై చిరంజీవి ప్రకటిస్తారనమాట. గతంలో నాని యాంకర్ గా రాణిస్తున్న సమయంలో విన్నర్ నేమ్ విక్టరీ వెంకటేష్ ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో కౌశల్ సీజన్ 2 కి విన్నర్ గా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా సీజన్ 3 కి టైటిల్ విన్నర్ ప్రకటించడానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వస్తున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.