బిగ్‌బాస్‌-3: శివజ్యోతి ఎలిమినేటెడ్… అలీ రెజా సేఫ్…

బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. మరో వారంలో ముగియనుందనగా.. ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆరుగురు సభ్యులు కాస్త.. అయిదుగురయ్యారు. శివజ్యోతి ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్3 హోస్ట్ నాగ్ ప్రకటించారు. ఇక ఆదివారం జరిగిన కార్యక్రమంలో హీరో విజయ్‌ దేవరకొండ, ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్ర సభ్యులు సందడి చేశారు. ఈ సందర్భంగా నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు ఇంటి సభ్యుల్లో వరుణ్‌ సందేశ్‌ సేవ్‌ అయినట్లు ప్రత్యేక అతిథిగా వచ్చిన […]

బిగ్‌బాస్‌-3: శివజ్యోతి ఎలిమినేటెడ్... అలీ రెజా సేఫ్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 28, 2019 | 11:24 AM

బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. మరో వారంలో ముగియనుందనగా.. ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆరుగురు సభ్యులు కాస్త.. అయిదుగురయ్యారు. శివజ్యోతి ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్3 హోస్ట్ నాగ్ ప్రకటించారు. ఇక ఆదివారం జరిగిన కార్యక్రమంలో హీరో విజయ్‌ దేవరకొండ, ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్ర సభ్యులు సందడి చేశారు. ఈ సందర్భంగా నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు ఇంటి సభ్యుల్లో వరుణ్‌ సందేశ్‌ సేవ్‌ అయినట్లు ప్రత్యేక అతిథిగా వచ్చిన విజయ్‌ దేవరకొండ ప్రకటించాడు. అనంతరం ఆడియన్స్‌ నుంచి ఆశించినన్ని ఓట్లు రాకపోవడంతో.. శివజ్యోతి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున తెలిపారు.

దీంతో ఎలిమినేట్ అన్న మాట వినడంతోనే శివజ్యోతి తీవ్ర భావోద్వేగానికి లోనై.. ఏడవ సాగింది. అయితే ఎప్పటి నుంచో శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందంటూ వార్తలు వచ్చినా.. ఇప్పటి దాక ఎలిమినేషన్ తప్పించుకుంటూ వచ్చింది. ఒక్క శివ జ్యోతినే కాదు..వితిక కూడా నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే శివజ్యోతి ఎలిమినేట్‌తో అలీ రెజా సేఫ్‌లొ పడ్డాడు. ఇంకా బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజా మిగిలారు. అయితే వీరందరిలో టైటిల్ ఎవరు అందుకుంటారన్న దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వారం వేచి చూస్తే.. టైటిల్ విన్నర్ ఎవరు అన్నది తేలిపోనుంది.