బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్..

బిగ్ బాస్ సీజన్ 3 మరో వారంలో ముగియనుంది. ఈ రోజుతో 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో విజేత ఎవరనేది మరో వారం రోజుల్లో తెలిసిపోనుంది. చివరి అంకంకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు ‘టికెట్ టు ఫినాలే’ ద్వారా ఫైనల్స్‌కు చేరుకోగా.. మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకోవడానికి బాగానే కష్టపడుతున్నారు. షో చివరి దశలో ఉండటం వల్ల కంటెస్టెంట్లకు […]

బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2019 | 2:52 PM

బిగ్ బాస్ సీజన్ 3 మరో వారంలో ముగియనుంది. ఈ రోజుతో 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో విజేత ఎవరనేది మరో వారం రోజుల్లో తెలిసిపోనుంది. చివరి అంకంకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు ‘టికెట్ టు ఫినాలే’ ద్వారా ఫైనల్స్‌కు చేరుకోగా.. మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకోవడానికి బాగానే కష్టపడుతున్నారు. షో చివరి దశలో ఉండటం వల్ల కంటెస్టెంట్లకు కఠినమైన టాస్కులు ఇచ్చి పరీక్ష పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఈ వారం నామినేషన్స్‌లో అలీ రెజా, వరుణ్ , శివజ్యోతిలు మిగిలారు.

ఇదిలా ఉండగా ఎప్పటిలానే ఈ వారం యాంకర్ శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా రీ-ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని నెట్టింట్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కూడా కారణం లేకపోలేదు. హౌస్ నుంచి బయటికి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి అలీ పరిస్థితుల బట్టి గేమ్ ఆడుతున్నాడని.. అంతేకాకుండా మునపటి జోష్ కూడా అలీలో లేకపోవడం వల్ల అతనికి తక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.