బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ’.. ఎవర్ని తీసుకెళ్తాడో..?

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ’ వెళ్లి సందడి చేయబోతున్నాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్ చేసేందుకు.. బిగ్‌బాస్.. విజయ్‌ను హౌస్‌లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. రౌడీని చూసి.. శివజ్యోతి, వరుణ్, బాబా బాస్కర్ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్టార్‌ మా ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. కాగా.. హౌస్‌లోకి వెళ్లిన విజయ్.. హౌస్‌మెట్స్ అందర్నీ పలకరిస్తాడు. ఈలోపు నాగ్.. విజయ్‌ని పలకరించి.. పెళ్లి […]

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'రౌడీ'.. ఎవర్ని తీసుకెళ్తాడో..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 27, 2019 | 1:41 PM

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ’ వెళ్లి సందడి చేయబోతున్నాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్ చేసేందుకు.. బిగ్‌బాస్.. విజయ్‌ను హౌస్‌లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. రౌడీని చూసి.. శివజ్యోతి, వరుణ్, బాబా బాస్కర్ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్టార్‌ మా ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది.

కాగా.. హౌస్‌లోకి వెళ్లిన విజయ్.. హౌస్‌మెట్స్ అందర్నీ పలకరిస్తాడు. ఈలోపు నాగ్.. విజయ్‌ని పలకరించి.. పెళ్లి గురించి ప్రస్తావిస్తాడు. దానికి.. విజయ్ నాకు ఇంకా అమల దొరకలేదని చెప్తాడు. దానికి నాగ్.. నీ అమల దొరకాలని.. కోరుకుంటున్నా అంటూ విష్ చేస్తాడు. ఆ మాటలు.. సన్నివేశం కాస్తా.. అందర్నీ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. అయితే.. ఆదివారం హౌస్‌లోకి వచ్చిన సెలబ్రెటీస్.. ఒక హౌస్‌మెట్‌ని తీసుకుని వెళ్తారు. మరి.. విజయ్ ఎవర్ని తీసుకెళ్తాడో.. అని బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. మరో వారం రోజుల్లో.. బిగ్‌బాస్ సీజన్ 3 కంప్లీట్ కాబోతుంది. ఈ వారం నామినేషన్‌లో శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు.