శ్రీముఖి దొంగాటతో అందరూ బలి.. హేమ సంచలన కామెంట్స్..!

ప్రముఖ నటి హేమ.. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3లోకి అడుగు పెట్టి.. మొదటి వారంలో.. బయటకు వచ్చేసింది. దీంతో.. బయటకొచ్చిన హేమ.. షోపై.. హౌస్‌మెంట్స్‌పై ఫుల్ కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఇప్పుడు మరోమారు.. యాంకర్ శ్రీముఖి, బిగ్‌బాస్ నిర్వాహకులపై ఒక రేంజ్‌లో విరుచుకుపడింది. బిగ్‌బాస్‌ షోపైన, ఆ షో నిర్వాహకులపైన.. ప్రస్తుతం ఇప్పుడు హౌస్‌లో ఉన్నవారిపై ఘాటుగా.. హేమ విమర్శలు చేసింది. అంతా కలిసి ఓ పథకం ప్రకారం తనను తొలివారమే బిగ్‌బాస్ హౌస్‌ నుంచి […]

శ్రీముఖి దొంగాటతో అందరూ బలి.. హేమ సంచలన కామెంట్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:50 PM

ప్రముఖ నటి హేమ.. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3లోకి అడుగు పెట్టి.. మొదటి వారంలో.. బయటకు వచ్చేసింది. దీంతో.. బయటకొచ్చిన హేమ.. షోపై.. హౌస్‌మెంట్స్‌పై ఫుల్ కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఇప్పుడు మరోమారు.. యాంకర్ శ్రీముఖి, బిగ్‌బాస్ నిర్వాహకులపై ఒక రేంజ్‌లో విరుచుకుపడింది.

బిగ్‌బాస్‌ షోపైన, ఆ షో నిర్వాహకులపైన.. ప్రస్తుతం ఇప్పుడు హౌస్‌లో ఉన్నవారిపై ఘాటుగా.. హేమ విమర్శలు చేసింది. అంతా కలిసి ఓ పథకం ప్రకారం తనను తొలివారమే బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు పంపేశారని.. బిగ్‌బాస్ షో ప్రారంభం కావడానికి ముందే శ్రీముఖి బర్త్ డే వేడుకల్లో ఈ కుట్రకు ప్లాన్ చేశారని తెలిపింది హేమ. బిగ్‌బాస్ హౌస్‌లో తన గురించి పూర్తి ఏవీ వేయలేదని.. తన ఎంట్రీని దరిద్రంగా మార్చారని ఆరోపించింది.

శ్రీముఖి బయట ఒకటా.. లోపల మరొకలా మాట్లాడుతుందని.. హిమజ వచ్చేశాక బిగ్‌బాస్ చూడటమే మానేశానని.. ఎందుకంటే.. అందులో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని చెప్పుకొచ్చింది హేమ. శ్రీముఖి నా దగ్గర.. మంచిగా ఉంటూ.. నా వెనుక మరోలా చెప్పేదని.. ఆమె దొంగాటలు ఆడేదని.. శ్రీముఖిపై విమర్శలు గుప్పించింది హేమ. శ్రీముఖి అడిన గేమ్‌లో వీళ్లంతా బలి అవుతున్నారని పలు ఆరోపణలు చేసింది హేమ.

కాగా.. బిగ్‌బాస్ అంటే.. ఎవరో కాదు.. ఎడిటరే బిగ్‌బాస్.. వాళ్లు నెగిటీవ్‌ని మాత్రమే చూపిస్తారు. పాజిటీవ్‌ని అస్సలు చూపించరని.. బిగ్‌బాస్ షో పై ఘాటుగానే కామెంట్స్ చేసింది హేమ. మరో వైపు బిగ్‌బాస్‌ త్రీకి మరో వారంలో ఎండ్ కార్డ్‌ పడనుండగా.. హేమ చేసిన ఈ వ్యాఖ్యలు.. హౌస్‌మెంట్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.