బిగ్ బాస్ 13: సల్మాన్‌ను తిట్టాడు.. అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు!

బుల్లితెర సంచలన రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా మొదలైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే సీజన్ మొదటి నుంచి కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగుతుండటం.. అటు ప్రేక్షకులకు, ఇటు షో నిర్వాహకులకే కాకుండా సల్మాన్ ఖాన్‌కు కూడా కోపం తెప్పిస్తోంది. కొన్ని సందర్భాల్లో సల్మాన్ స్టేజిపైనే తన ఆగ్రహం వ్యక్తం చేసి.. మధ్యలో వెళ్లిపోవడం కూడా జరిగింది. […]

  • Ravi Kiran
  • Publish Date - 2:18 am, Tue, 29 October 19
బిగ్ బాస్ 13: సల్మాన్‌ను తిట్టాడు.. అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు!

బుల్లితెర సంచలన రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా మొదలైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే సీజన్ మొదటి నుంచి కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగుతుండటం.. అటు ప్రేక్షకులకు, ఇటు షో నిర్వాహకులకే కాకుండా సల్మాన్ ఖాన్‌కు కూడా కోపం తెప్పిస్తోంది. కొన్ని సందర్భాల్లో సల్మాన్ స్టేజిపైనే తన ఆగ్రహం వ్యక్తం చేసి.. మధ్యలో వెళ్లిపోవడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్.. కంటెస్టెంట్ల ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయారు. మొన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సల్మాన్ ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులందరికి గట్టిగా క్లాస్ పీకారని చెప్పాలి.’నీ ఆలోచన సరైనదే.. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. రష్మీ దేశాయ్, మహీరా శర్మ నిన్ను టార్గెట్ చేస్తున్నారనేది నిజమే కావచ్చు. కానీ వారిని నువ్వు విస్మరించడం నేర్చుకోవాలి’ అని సిద్ధార్థ్ శుక్లాకు చెప్పాడు.

మరోవైపు సిద్ధార్థ డేయ్ ప్రవర్తనకు పూర్తిగా సహనం కోల్పోయిన సల్మాన్ ఖాన్.. అతన్ని తిట్టడమే కాకుండా బూతు పదాలను కూడా వాడాడు. అంతేకాకుండా షెహనాజ్ అనే కంటెస్టెంట్‌కు ‘క్యారెక్టర్ సర్టిఫికెట్’ ఇవ్వడానికి నువ్వు ఎవరివి అని అడుగుతూ.. సిద్ధార్థపై మండిపడ్డాడు. కాగా, మిగతా కంటెస్టెంట్లకు షాక్ ఇస్తూ మిడ్ నైట్ ఎలిమినేషన్ అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. సిద్ధార్థ డేయ్‌ను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.

ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌కు మాత్రం ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులను నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఏ సమయంలో ఎలా ఉండాలో సల్మాన్‌కు కరెక్ట్‌గా తెలుసని.. అందుకే ఇన్ని సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించారని’ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.