బిగ్ బాస్ 3లో కౌశల్ శిష్యుడు.. మరి టైటిల్ విన్నర్ అతడేనా?
నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన కౌశల్ మందా అనూహ్యంగా భారీ మెజార్టీతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కౌశల్ బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఫైవ్ కంటెస్టెంట్లపై స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో చేశాడు. శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాల గురించి మాట్లాడిన […]
నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన కౌశల్ మందా అనూహ్యంగా భారీ మెజార్టీతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కౌశల్ బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఫైవ్ కంటెస్టెంట్లపై స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో చేశాడు.
శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాల గురించి మాట్లాడిన కౌశల్.. విన్నర్ ఎవరవుతారన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారని చెబుతూ.. తాను అందరికి సపోర్ట్ చేస్తూ న్యూట్రల్‌గా ఉంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలిచినా తనకు సంతోషమేనని కౌశల్ అన్నాడు.
అలీ రెజా గురించి కౌశల్ మాట్లాడుతూ ’18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోడల్‌గా అలీకి ట్రైనింగ్ ఇచ్చానని.. మేకోవర్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ కూడా చేశానని అన్నాడు. అలీ తొలి యాడ్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసి.. ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నేనే ఇచ్చాను. అలాంటి అలీ రెజా బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా చెప్పుకొచ్చాడు.