Shukra Gochar: స్వక్షేత్రమైన వృషభరాశిలోకి శుక్ర గ్రహ సంచారం.. ఆ రాశుల వారు హ్యాపీ హ్యాపీ..
Venus Transit: సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగారానికి, శారీరక సుఖాలకు, ప్రేమ వ్యవహారాలకు, సృజనాత్మకతకు, మనశ్శాంతికి కారకుడైన శుక్ర గ్రహం ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు తన స్వక్షేత్రమైన వృషభరాశిలో సంచరిస్తున్నాడు.
Venus Transit: సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగారానికి, శారీరక సుఖాలకు, ప్రేమ వ్యవహారాలకు, సృజనాత్మకతకు, మనశ్శాంతికి కారకుడైన శుక్ర గ్రహం ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు తన స్వక్షేత్రమైన వృషభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం వల్ల ఏడు రాశుల వారు అత్యధికంగా ప్రయో జనం పొందబోతున్నారు. ఇవి మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభం. శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తున్న కాలాన్ని ఈ ఏడు రాశుల వారు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఇది చంద్రుడు ఉన్న రాశులనే కాకుండా లగ్నా లకు కూడా వర్తిస్తుందని గమనించాలి. అదే విధంగా అన్ని నక్షత్రాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని కూడా గమనిం చాల్సి ఉంది. ఇక శుక్రుడికి సంబంధించినంత వరకు జీవితాన్ని ఎంజాయ్ చేయడమే గొప్ప పరిహారం. ఈ రాశుల వారికి శుక్రుడు ఏ విధంగా ఆనందం కలగజేస్తాడనేది ఇక్కడ పరిశీలిద్దాం.
- మేష రాశి: మేష రాశి వారికి ధన, కుటుంబ, వాక్ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ భావాలు అభివృద్ధి చెందటం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, అదనపు ఆదాయానికి, బాకీలు వసూళ్లకు ఎంతగానో అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల రోజుల కాలంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని, స్థిరత్వం ఏర్పడుతుందని భావించవచ్చు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ మాటకు సర్వత్ర విలువ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
- వృషభ రాశి: శుక్ర గ్రహం ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా విజయం సాధిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. ఆరో గ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. శృంగార జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ముందుకు సాగిపోతుంది. స్త్రీలతో పరిచయాలు పెరుగుతాయి. విలాస జీవితం గడుపుతారు. ప్రకృతి సౌందర్యం అత్యధికంగా ఉన్న రమణీయ ప్రదేశాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో కూడా ఆదరణ లభిస్తుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో శుక్ర సంచారం జరగటం విశేషం. తప్పకుండా ఆర్థిక పురోగతి అనుభవానికి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మహిళల కారణంగా సామాజిక హోదా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.
- సింహ రాశి: శుక్ర గ్రహం దశమ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం పట్టబోతోంది. ప్రస్తుతం శని, గురువు, రాహువు ఇస్తున్న ప్రతికూల ఫలితాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. వారసత్వంగా ఆస్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు కలిగిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
- కన్యా రాశి: ఈ రాశి వారికి శుక్రుడు భాగ్య స్థానంలో సంచరించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారే కాకుండా ఈ రాశి వారి తల్లిదండ్రులు కూడా సుఖసంతోషాలతో మునిగి తేలటానికి అవకాశం ఉంది. విహార యాత్రలు, తీర్థ యాత్రలు, దూర ప్రయాణాలు చేయవచ్చు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
- మకర రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం జరుగుతుంది. వీరిలో సృజనాత్మకత బాగా పెరుగుతుంది. వీరి సలహాలను, సూచనలను అధికారులు లేదా యాజమాన్యాలు స్వీకరించి ప్రయోజనం పొందుతాయి. వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు చేసే ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. సరికొత్త సంపాదన మార్గాలు ఈ రాశి వారి ముందుకు వస్తాయి. పిల్లలు విశేషంగా పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు. రచనా వ్యాసంగంలో లేదా సాహిత్య రంగంలో ఉన్నవారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
- కుంభ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు నాలుగో స్థానంలో సంచ రించడం వల్ల ఏలినాటి శని ఫలితాల నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని చెప్పవచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు లభిస్తాయి. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీ సాంగత్యం ఏర్పడుతుంది. శారీరక సుఖాలు పెరుగుతాయి. విహార యాత్రల మీద, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు అప్రయత్నంగా నెరవేరుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..