ధనూ రాశిలో చంద్రుడు సంచారం.. వారి లక్ష్యాలు నెరవేరడం పక్కా.. ! మరి మీ రాశికి ఎలా ఉందంటే..?
చంద్రుడికి ధనూ రాశి మిత్ర రాశి. ధనూరాశికి అధిపతి గురువు. గురు గ్రహం తన రాశిలో ఉన్న చంద్రుడిని పూర్తి స్థాయిలో వీక్షించడం కూడా జరుగుతుంది. ఇది చంద్రుడికి విశేషంగా బలమిస్తుంది. చంద్రుడు కోరికలు తీర్చగలిగిన స్థితిలో ఉంటాడు. ఈ నెల 30, 31 తేదీలలో చంద్రుడు ధనూ రాశిలో సంచరిస్తున్నాడు. మనఃకారకుడైన చంద్రుడు ధనూ రాశిలో సంచరించడమంటే యాంబిషన్ పెరగడమన్నమాట.

ఈ నెల 30, 31 తేదీలలో చంద్రుడు ధనూ రాశిలో సంచరిస్తున్నాడు. మనఃకారకుడైన చంద్రుడు ధనూ రాశిలో సంచరించడమంటే యాంబిషన్ పెరగడమన్నమాట. వివిధ రాశుల వారిలో ఆ రాశి తత్వాన్ని బట్టి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, అత్యాశలు, దురాశలు పెరగడం జరుగుతుంది. కొత్త ఆశలను, ఆశయాలను మనసులో పెట్టుకోవడానికి, అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడానికి ఈ రెండు రోజులు చాలా మంచి సమయం అని, అనుకూల సమయమని చెప్పవచ్చు. చంద్రుడికి ధనూ రాశి మిత్ర రాశి. ధనూరాశికి అధిపతి గురువు. గురు గ్రహం తన రాశిలో ఉన్న చంద్రుడిని పూర్తి స్థాయిలో వీక్షించడం కూడా జరుగుతుంది. ఇది చంద్రుడికి విశేషంగా బలమిస్తుంది. చంద్రుడు కోరికలు తీర్చగలిగిన స్థితిలో ఉంటాడు.
మేషం: అధికారం చేపట్టాలని, పది మంది మీదా పెత్తనం చెలాయించాలని వీరి కోరిక. ఈ కోరిక నెరవేర డానికి అవకాశం ఉంది. మేష రాశిలో ఉన్న గురువు దృష్టి ధనూ రాశిలో ఉన్న చంద్రుడి మీద పడడం వల్ల మేష రాశివారి చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. అధికారాన్ని చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందరి కంటే ముందుండాలన్న ఆకాంక్ష కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. కొత్త ఆశలకు, కొత్త ఆలోచనలకు ఇది అనుకూల సమయం.
వృషభం: అపర కుబేరులు కావాలన్న కోరిక ఫలించకపోవచ్చు కానీ, తప్పకుండా ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అప్పులివ్వడం, డబ్బు మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆస్తి పెంచుకోవడం వంటి ఆశలు లేదా అత్యాశల మీద దృష్టి పెట్టడానికి, వాటి గురించి గట్టి ప్రయత్నం చేయడానికి ఇది అన్ని విధాలా అనుకూల సమయం.
మిథునం: విద్య, బోధన, పరిశోధన, క్రీడలు, కమ్యూనికేషన్స్, రవాణా, పర్యాటకం వంటి రంగాలలో ఉన్నవారి మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడానికి అవకాశం ఉంది. మనసులో కోరికలను ఏర్పరచుకోవ డానికి, ఆ కోరికలు తీరేలా ప్రయత్నించడానికి ఇది అనుకూల సమయం. ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన ఆశలు, ఆశయాలకు కూడా ప్రయత్నించడం మంచిది. ఈ రెండు రోజుల్లో తమ ఆశలు లేదా కోరికలు తీర్చుకునే దిశగా అడుగులు వేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
కర్కాటకం: ఈ రాశి నాథుడైన చంద్రుడు తన మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలో సంచరించడం, దాని మీద గురు దృష్టి పడడం వల్ల మనసులోకి ఒకటి రెండు కోరికలు తప్పకుండా నెరవేరే సూచనలున్నాయి. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అందలాలు ఎక్కాలన్న ఆశ ప్రస్తుతానికి నెరవేరే అవకాశం లేదు కానీ, హేతుబద్ధమైన, సజావైన కోరికలు నెరవేరడానికి మాత్రం అవకాశం ఉంది. మనసులో మంచి ఆశయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది.
సింహం: అధికార కాంక్ష చాలావరకు నెరవేరడం జరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. అందుకు మార్గం సుగమం అవుతుంది. ఉన్నత సంస్థలో ఉద్యోగం సంపాదించాలన్న ఆశ కూడా నెరవేరే అవకాశం ఉంది. అందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి ఈ రెండు రోజుల్లో ప్రయత్నాలు చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. దూర ప్రాంతంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
కన్య: ఈ రాశివారిలో వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి యాంబిషన్ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకోవాలనే తపన విజృంభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన, కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో వీరి వ్యూహాలు, ప్రయోగాలు ఫలిస్తాయి. పిల్లలకు సంబంధించి మనసులో ఉన్న కోరికలు, ఆశలు నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. ఆశలు నెరవేరడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.
తుల: వ్యాపారాలు, స్వయం ఉపాధి, వృత్తి జీవితానికి సంబంధించి మనసులోని కోరికలు నెరవేరు తాయి. పేదలకు, అనాథలకు సహాయం చేయాలన్న ఆలోచన, ఆశయం నెరవేరుతాయి. సామా జిక సేవలకు సంబంధించి వీరిలో ఉన్న ఆశలు నెరవేరడానికి కూడా అవకాశం ఉంది. ధన సంపా దనకు సంబంధించిన వీరి ఆశయ సాధనకు తీవ్రస్థాయి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకు ఈ రెండు రోజుల కాలం కొద్దో గొప్పో దోహదం చేస్తుంది. ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చికం: ఆదాయం పెరగడం జరుగుతుంది కానీ, ఆశించిన స్థాయిలో అపార ధన లాభం కలిగే అవకాశం లేదు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆశలు నెరవేరడానికి ఇప్పటి నుంచే ప్రయ త్నాలు ప్రారంభించడం మంచిది. సమయం అందుకు అనుకూలంగా ఉంది. ఆశించిన విధంగా పిల్లలు వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. రుణ సమస్యలు పరిష్కారం కావాలన్న ఆకాంక్ష నెరవేర డానికి కూడా అవకాశం ఉంది. పట్టుదలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు: సాధారణంగా ఈ రాశివారికి యాంబిషన్ ఎక్కువ. ఆశలే కాదు, ఆశయాలు కూడా ఎక్కువే. అధికార యోగానికి సంబంధించిన వీరి మనసులోని కోరిక నెరవేరడానికి మార్గం సుగమం అవు తుంది. ఈ రాశివారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అనేక ఆశలు, ఆకాంక్షలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. మనసులో ఏదో ఒక కోరికను, ఆశను పెట్టుకోవడం, దాని కోసం ప్రయత్నించడం ఈ రాశివారికి ఉపయోగంగా ఉంటుంది. ఇందుకు సమయం అనుకూలంగా ఉంది.
మకరం: ధన సంపాదనతో పాటు పదిమందికీ సేవ చేయాలన్న ఆశయం, సహాయకారిగా ఉండాలన్న వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా నెరవేరే అవకాశం ఉంది. అందరిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలన్న తపన కూడా నెరవేరే సూచనలు న్నాయి. ముఖ్యమైన ఆశయాలు నెరవేరడానికి కృషి చేసేందుకు ఇప్పుడు సమయం అను కూలంగా ఉంది. ఇందుకు సంబంధించి వీరికి అవకాశాలు కలిసి రావడం కూడా జరుగుతుంది.
కుంభం: వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు, గౌరవమర్యాదలు, సామాజిక సేవలు, రాజకీయాలు తదితర అంశా లకు సంబంధించిన వీరి కోరికలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది. తప్పకుండా గౌరవ మర్యాదుల పెరగడం, గుర్తింపు లభించడం, ముఖ్యులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి పలుకు బడి పెరగ డం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు, సామాజిక సేవల్లో పాల్గొనే అవకాశం కూడా అందివస్తుంది. రాజకీయాలకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఇది సరైన సమయం.
మీనం: బోధన, ప్రవచనాలు, కళలు, పరిశోధన, ఉన్నత విద్య, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అంశాలకు సంబంధించిన వీరి ఆశలు చాలా వరకు అనుభవానికి వస్తాయి.ఉద్యోగంలో కూడా ప్రాభవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడం, మహనీయులను కలుసుకోవడం వంటి ఆశయాలు కూడా నెరవేరుతాయి. ఈ విషయాలలో కొత్తగా ప్రయత్నాలు తలపెట్టదలచుకున్నవారికి ప్రస్తుత సమయం కలిసి వచ్చే సమయం. కొద్దిపాటి ప్రయత్నంతో వీరి ఆశయాలు నెరువేరుతాయి.



