Birth Star Astrology: ఈ జన్మ నక్షత్రాలవారి జీవితంలో కొత్త అధ్యాయం.. వారి తలరాతలే మారిపోతాయంటే నమ్మండి..
కొన్ని నక్షత్రాల వారికి ఈ ఏడాది చిత్ర విచిత్రంగా తల రాతలు మారబోతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా వీరి జీవితాలు ఊహించని మలుపులు తిరగటం జరుగుతుంది.

Birth Star AstrologyImage Credit source: TV9 Telugu
Telugu Astrology: కొన్ని నక్షత్రాల వారికి ఈ ఏడాది చిత్ర విచిత్రంగా తల రాతలు మారబోతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా వీరి జీవితాలు ఊహించని మలుపులు తిరగటం జరుగుతుంది. వాస్తవానికి ఈ మార్పులు చేర్పులు ఇప్పటికే ప్రారంభం అయిపోయినా ఆశ్చర్య పడనక్కర్లేదు. అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు పుష్యమి పుబ్బ హస్త స్వాతి అనురాధ, ఉత్తరాషాడ, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి జీవితంలో ఈ ఏడాది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యే సూచనలు న్నాయి. ఫిబ్రవరి నుంచే శుభపరిణామాలు చోటు చేసుకోవడం ప్రారంభం అయినప్పటికీ వీరికి ఏప్రిల్ 23 నుంచి ఈ పరిణామాల ఫలితాలు అనుభవానికి వస్తాయి.
అశ్విని, భరణి, రోహిణి
ఈ నక్షత్రాల వారికి ఆర్థికపరంగా రాజకీయ పరంగా మంచి శుభయోగాలు అనుభవానికి వస్తాయి. అతి తక్కువ ప్రయత్నంతో వీరు ఊహించనంతగా అధికారం చేపట్టడానికి, వీరి ఆదాయం పెరగటానికి అవకాశం ఉంది. అతి కష్టమైన వ్యక్తిగత సమస్యలు కూడా చాలా సులువుగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. అతి తక్కువ కాలంలో అతి వేగంగా అనూహ్యంగా జీవితం మారిపోతుంది. కొత్త మలుపులు తిరుగుతుంది. కలలో కూడా ఊహించని శుభవార్తలు చెవిన పడతాయి. ఒక కథలాగా జీవితం మార్పులు చేర్పులకు లోనవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే, అనవసర పరిచయాలకు అక్రమ సంబంధాలకు వ్యసనా లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పక తప్పదు. ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
పునర్వసు, పుష్యమి
ఈ రెండు నక్షత్రాల వారికి ఉద్యోగ పరంగా, వృత్తి, వ్యాపారాల పరంగా చక్కని స్థిరత్వం ఏర్పడు తుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. యాజ మాన్యానికి దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడు తుంది. గృహ, వాహన యోగాలకు కూడా అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవు తాయి. మంచి కుటుంబంలో లేదా సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐటి ఇంజనీరింగ్ సైన్స్ వంటి రంగాలలో ఉన్న వారికి విదేశాల నుంచి మంచి ఆఫర్లు అంద వచ్చు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. కాగా, ఈ నక్షత్రాల వారు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. ఇతరుల విషయాలలో లేదా వ్యవహారాలలో తల దూర్చకపోవటం చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
పుబ్బ, హస్త, స్వాతి
ఈ నక్షత్రాల వారు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా ఒక సరికొత్త జీవితాన్ని అనుభవించబోతున్నారు. చిన్న ప్రయత్నం చేసినా వంద శాతం ఫలితాలను పొందటం జరుగుతుంది. సమాజంలో పలుకు బడి పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకోకుండా కొత్త ఆఫర్లు వీరి ముందుకు వస్తాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. విదేశాలలో స్థిరపడటానికి కూడా అవకాశం ఉంది. ఆస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. పిల్లలు ఘనవిజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధాలు ఖాయం అవుతాయి. మిత్రులు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రేమ వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే, ఈ నక్షత్రాల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎటువంటి పరిస్థితులలోనూ ఏకపక్షంగా వ్యవహరించవద్దు.
అనూరాధ, ఉత్తరాషాఢ
ఈ రెండు నక్షత్రాల వారికి ఈ ఏడాది శని, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మంచి రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. స్థిర, చరాస్తులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. దాంపత్య సమస్యలు పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతాయి. రాజకీయంగా కూడా పదవీ యోగం కనిపిస్తోంది. శత్రువుల మీద విజయం సాధించడం జరుగుతుంది. రుణ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. అయితే, ఈ నక్షత్రాల వారు పట్టు విడుపులతో వ్యవహ రించాల్సిన అవసరం ఉంది. మొండితనంతో వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
శతభిషం, ఉత్తరాభాద్ర
ఈ నక్షత్రాల వారికి రాజకీయంగా, వృత్తి పరంగా ఈ ఏడాది విజయాలు ఖాయం అని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి ఆశిం చిన ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, స్థలాలు ఇతర ఆస్తులు చిన్న ప్రయత్నంతో చేతికి అందటం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అధికార యోగం లేదా పదవీ యోగం పట్టే సూచనలు ఉన్నాయి. ఈ నక్షత్రాల వారు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు, విదేశీ ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాలకు ఆఫర్లు రావచ్చు. వీసా సమస్యలు పరిష్కారం కావచ్చు. అయితే, ఈ నక్షత్రాల వారు ఒకటి రెండు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సన్నిహితులే ద్రోహం లేదా మోసం చేసే సూచనలున్నాయి. బద్ధకాన్ని లేదా సోమరితనాన్ని దగ్గరకు రానివ్వవద్దు.
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..
ఇవి కూడా చదవండి

Shani Gochar 2023: మార్చి 15న శతభిష నక్షత్రంలోకి శని గ్రహ ప్రవేశం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…

Gajlaxmi Rajyog 2023: ఒకే రాశిలోకి గురుచంద్రులు.. ఈ 3 రాశులవారికి లక్కే లక్.. పట్టిందల్లా బంగారమే..

Weekly Horoscope (March 12-18): ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే?

Rahu Effects: రాహువుతో ఆ నాలుగు రాశులవారు కాస్తంత జాగ్రత్త! గ్రహ దోష పరిహారాలు ఏంటో తెలుసుకోండి..