AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capricorn: మకరరాశి వారి విషయంలో అందరూ పొరపాటు పడే అపోహలు ఇవే.. ఓ సారి చెక్ చేసుకోండి..

రాశిచక్రంలోని మొత్తం 12 రాశులలో 10వ రాశి మకరం. డిసెంబర్ 22 నుండి జనవరి 19 మధ్య జన్మించిన వ్యక్తులు ఈ రాశిచక్రం కిందకు వస్తారు.

Capricorn: మకరరాశి వారి విషయంలో అందరూ పొరపాటు పడే అపోహలు ఇవే.. ఓ సారి చెక్ చేసుకోండి..
Capricorn
Madhavi
| Edited By: |

Updated on: Mar 13, 2023 | 6:22 PM

Share

రాశిచక్రంలోని మొత్తం 12 రాశులలో 10వ రాశి మకరం. సూర్యమానం మేరకు డిసెంబర్ 22 నుండి జనవరి 19 మధ్య జన్మించిన వ్యక్తులు ఈ రాశిచక్రం కిందకు వస్తారు. జ్యోతిషశాస్త్రంలో, మకరం క్రింద జన్మించిన వ్యక్తులు కఠినమైన, క్రమశిక్షణ ఉన్న వ్యక్తిత్వ లక్షణాలను చూపుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి ఈ వ్యక్తిత్వ లక్షణాలు వారిపై కొన్ని అపోహలను సృష్టిస్తాయి.

మకరరాశి వారు నిజంగా బోరింగ్‌గా ఉంటారు:

మకరరాశి వారు చాలా క్రమశిక్షణతో చూసేందుకు గంభీరంగా ఉంటారు. అందుకే వీరిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. కొంత మంది వీరితో ఉండటాన్ని బోరింగ్‌గా భావిస్తారు. మకరరాశి వారు సాధారణంగా పద్ధతి ప్రకారం జీవించడానికి ఇష్టపడతారు. అయితే మకర రాశి వారు ఎదుటివారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. అలాగే వారు స్నేహంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. అందుకే వీరితో స్నేహం బోరింగ్ కొడుతుంది, అనుకోవడం ఒక అపోహ మాత్రమే.

ఇవి కూడా చదవండి

మకరరాశి వారు రిస్క్ తీసుకోకుండా ఉంటారు:

మకర రాశివారు ఏదైనా పని చేసే ముందు ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే, వారు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు అనే దాంట్లో అర్థం లేదు. కెరీర్ లేదా ఉద్యోగం కోసం రిస్క్ తీసుకునే విషయానికి వస్తే, మకరరాశి వారు రిస్క్‌లకు అనుగుణంగా పనిచేస్తారు. మకరరాశి కొన్ని విషయాల్లో సిగ్గుపడతారు. రిస్క్‌లను తీసుకునే ప్లాన్ చేసి, రిస్క్‌ వల్ల కలిగే కష్ట నష్టాలను ముందే బేరీజు వేస్తుంటారు. అందువల్లే వారిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు.

మకరరాశిని సంతృప్తిపరచడం కష్టం:

మకరరాశి వారు నిరంతరం నేర్చుకునే స్వభావం కలిగినవారు. వారు తమ లక్ష్యాలను సాధించే వరకు ఎప్పటికీ ఆగరు. లక్ష్యం-ఆధారితంగా ఉండటమే వారి బలం మకరరాశిని సంతృప్తిపరచడం అసాధ్యం అనేది పూర్తి అపోహ.

మకరరాశి వారు పాలించడానికి ఇష్టపడతారు:

మకరరాశివారు అహంకారంతో అని ఇతరుల జీవితాన్ని నియంత్రించడానికి ఇష్టపడతారని అంతా భావిస్తారు. కానీ మకరరాశి వారు తమ గురించి ఆలోచించకుండా తమ దగ్గరి ప్రియమైన వారిని కాపాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

మకరరాశి వారికి భావోద్వేగాలు ఉండవు:

మకరరాశి వారు క్రమశిక్షణతో ఉంటారనేది నిజం. అయితే, మకరరాశి వారు భావరహితంగా ఉంటారని భావించడం సరికాదు. మకరరాశి వారు తమ కుటుంబాన్ని ప్రేమిస్తారు వారి స్వంత స్నేహితుల సర్కిల్‌లో గడపడానికి ఇష్టపడతారు.

మకర రాశి వారు నిజానికి తమ సన్నిహితులతో చాలా ప్రేమగా ఉంటారు. కానీ అదే సమయంలో వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు దీంతో మకర రాశి వారికి సెంటిమెంట్లు ఉండవని చాలా కఠినంగా ఉంటారని పొరపాటు ఉంటారు. కానీ వారు తమ సన్నిహితుల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ మంచి చేయాలని తపన పడుతూ ఉంటారు. అంతే కాదు మకర రాశి వారు తమతో పాటు ఇతరులు కూడా ఎదగాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. మకర రాశి వారు ఇతరులకు సహాయం చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గరు.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?