AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: రెండో పెళ్లి యోగం: ఈ ఐదు నెలల్లో పుట్టిన అబ్బాయిలకు మళ్లీ పెళ్లి పక్కా!

జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. కానీ, అందరి వివాహాలు విజయవంతం కావు. అలాంటివారు విడాకులు తీసుకొని రెండో పెళ్లికి సిద్ధపడవచ్చు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన నెలల్లో జన్మించిన అబ్బాయిల జాతకంలో రెండో వివాహ యోగం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఆ నెలలు ఏంటి, వారి స్వభావాలు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం.

Astrology: రెండో పెళ్లి యోగం: ఈ ఐదు నెలల్లో పుట్టిన అబ్బాయిలకు మళ్లీ పెళ్లి పక్కా!
Is Your Birth Month A Factor
Bhavani
|

Updated on: Aug 24, 2025 | 9:46 PM

Share

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యఘట్టం. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొన్ని బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాంటి సందర్భాల్లో కొంతమంది రెండో వివాహానికి సిద్ధమవుతారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక నెలల్లో జన్మించిన అబ్బాయిల జాతకంలో రెండో వివాహ యోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఆయా వ్యక్తుల స్వభావాలు, నైజాలు. అవి ఆయా నెలల్లో జన్మించిన వారికి సహజంగానే ఉంటాయి.

ఏప్రిల్: ఏప్రిల్‌లో పుట్టిన పురుషులు తమ జీవితంలో భద్రత, స్థిరత్వాన్ని ఎక్కువగా ఆశిస్తారు. మొదటి బంధంలో ఈ ఆశలు నెరవేరకపోతే, రెండో పెళ్లికి వెనకాడరు. తమ ఆశయాలు, వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు.

జూన్: జూన్‌లో పుట్టిన అబ్బాయిలు స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మొదటి వివాహంలో ఈ అంశాలకు లోటు ఏర్పడితే, ఆ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడరు. తమ స్వేచ్ఛను గౌరవించే, తమతో కలిసి జీవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తారు.

ఆగస్టు: ఆగస్టులో జన్మించినవారు విశాల హృదయులు. ప్రేమను పంచుకోవడంలో ముందుంటారు. తమ నిర్ణయాలను ఇతరులు గౌరవించాలని, వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. భాగస్వామి ఈ విషయాల్లో వారికి సహకరించకపోతే, జీవితాంతం వారితో కలిసి ఉండలేరు. తమ ఆలోచనలను పంచుకునే వ్యక్తితోనే జీవితం కావాలని కోరుకుంటారు.

నవంబర్: నవంబర్‌లో పుట్టిన పురుషులు సామరస్యాన్ని, సమతుల్యతను ఎక్కువగా ఇష్టపడతారు. మొదటి వివాహంలో వాటికి దూరమయ్యారని భావిస్తే, వాటిని పొందడానికి రెండో వివాహం వైపు దృష్టి సారిస్తారు. కానీ, వీరు రెండో అడుగు వేయడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. భాగస్వామిని ఎంచుకునే విషయంలో తొందరపడరు.

డిసెంబర్: డిసెంబర్‌లో జన్మించినవారు భావోద్వేగపరులు, ఉత్సాహవంతులు. పనిపట్ల వీరికి ఆసక్తి ఎక్కువ. మొదటి వివాహంలో సంతోషం లేకపోతే, రెండో వివాహం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు. తమ అభిరుచులు, ఆలోచనలకు తగిన భాగస్వామి దొరికితే, వారితోనే జీవించాలనుకుంటారు. ఇష్టం లేని వ్యక్తితో ఉండలేరు.

ఈ నెలల్లో పుట్టిన వ్యక్తులందరికీ రెండో వివాహం అవుతుందని చెప్పడం కష్టం. కానీ, వారి స్వభావం కారణంగా అలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు అందిస్తున్న సమాచారం మాత్రమే