Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎంతో పిరికివారు.. ఏ విషయంలోనూ అస్సలు తలదూర్చరు..
Zodiac Signs: కొంతమంది స్వభావరీత్యా చాలా ధైర్యంగా ఉంటారు. మరికొందరు చాలా పిరికిగా ఉంటారు. అలాంటి వారు తమకు ఎలాంటి కష్టం వచ్చినా.. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోకుండా..
Zodiac Signs: కొంతమంది స్వభావరీత్యా చాలా ధైర్యంగా ఉంటారు. మరికొందరు చాలా పిరికిగా ఉంటారు. అలాంటి వారు తమకు ఎలాంటి కష్టం వచ్చినా.. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోకుండా.. పారిపోతారు. జ్యోతిష్కుల ప్రకారం.. అలాంటి వారి స్వభావం ఎక్కువగా వారి గ్రహ నక్షత్ర సమూహాల కారణంగా ఏర్పడుతుంది. అయితే.. క్లిష్ట, కష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఎవరు పరాయి.. ఎవరు ఆప్త మిత్రులు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే విపత్తు సంభవించినప్పుడు, ధైర్యంతో నిలబడి మీకు మద్దతు ఇచ్చే వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలా మంది ఆ పరిస్థితులను, అవకాశాలను చూసి వదిలి పారిపోతుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి ధైర్యం లేదా పిరికితనం అనేది వారి గ్రహ స్థానం, రాశి చక్రం ప్రభావం మీద ఆధారపడుతుంది. అయితే.. ఈ కింద ఇచ్చిన మూడు రాశులు కూడా అంతే.. వారు సమస్యల్లో నిలబడరు.. వారికి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్కాటక రాశి : ఈ రాశి గల వ్యక్తులు ఏ విషయంలోనూ ఎక్కువగా తలదూర్చడానికి ఇష్టపడరు. ఈ వ్యక్తులు సరళమైన రీతిలో ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. వీరు జీవితంలోని ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తుంటారు. తద్వారా ఎలాంటి తప్పులు.. ఇబ్బందులు కలగవని భావిస్తుంటారు. స్వభావరీత్యా.. ఇతరుల వ్యవహారాల్లో కూడా తలదూర్చరు. ఎవరికైనా గొడవ పడుతుంటే.. శాంతియుత పరిష్కారం కోసం సిఫార్సు చేస్తారు.. లేదా నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కర్కాటకరాశి వరు తెలివైనవారని.. ధైర్యంగా కాకుండా తెలివిగా సమస్య పరిష్కరమయ్యేలా చూస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు చాలా పిరికివారు. కీటకాలు, సాలెపురుగులు, ఎలుకలు, బొద్దింకలు, బల్లులు వంటి జీవులను చూసినా చాలా భయపడతారు. ఇలాంటివి వారు ఉన్న చోట కనిపిస్తే.. అభద్రతగా.. అసౌకర్యవంతంగా ఫీలవుతారు. అంతేకాకుండా దెయ్యం కథలను కూడా ఇష్టపడరు. ఎందుకంటే వారు వింటే.. వారిలో భయం ఎక్కువగా కలుగుతుంది. కావున ఈ వ్యక్తులు ఎవరి విషయాల్లో, అవసరాల్లో జోక్యం చేసుకోరు. ఒంటరిగా ఉంటూ వారంతటికీ వారే కలత, నిరాశ చెందుతారు.
కుంభ రాశి : ఈ రాశి వారు మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఈ వ్యక్తులు ఎదుటి వారి విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. వేరే వ్యక్తులు వారి విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని కూడా సహించరు. కావున ఈ వ్యక్తులు హద్దులు దాటకుండా ఎల్లప్పుడూ తమను తాము నియంత్రించుకుంటూ జీవిస్తారు. ఎవరైనా గొడవ పడినా.. ఎక్కడైనా గొడవ జరిగినా.. అక్కడి నుంచి దూరంగా వెళతారు. తమ జీవితాన్ని మాత్రమే ప్రేమిస్తూ.. ఎదుటి వారి గురించి అస్సలు పట్టించుకోరు.
Also Read: