వరంగల్‌ చాయ్‌వాలా అరుదైన గౌరవం.. పీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు.. అసలు విషయమేంటంటే!

తెలంగాణకు చెందిన ఓ టీ షాపు నిర్వాహకుడికి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇన్విటేషన్‌ వచ్చింది. అది ఎక్కడ్నుంచో కాదు...ఏకంగా పీఎంవో కార్యాలయం నుంచి..

వరంగల్‌ చాయ్‌వాలా అరుదైన గౌరవం.. పీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు.. అసలు విషయమేంటంటే!
Pm Modi
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2021 | 2:39 PM

తెలంగాణకు చెందిన ఓ టీ షాపు నిర్వాహకుడికి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇన్విటేషన్‌ వచ్చింది. అది ఎక్కడ్నుంచో కాదు…ఏకంగా పీఎంవో కార్యాలయం నుంచి… ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. జూలై మొదటి వారంలో సిద్ధంగా ఉండాలని చాయ్‌‌వాలా మహ్మద్‌ పాషాకు పీఎంఓ నుంచి లేఖ అందింది. ఈ విషయాన్ని వరంగల్‌ జిల్లా మెప్మా పీడీ భద్రు కన్ఫామ్‌ చేశారు.

మహ్మద్‌ పాషా ఎంజీఎం ఆస్పత్రి దగ్గర 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పై చాయ్‌ షాపు నిర్వహిస్తున్నారు. గతేడాది ఆగస్టులో పీఎం ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా 10వేల రుణాన్ని కూడా తీసుకున్నారు. ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో పాటు టీ అమ్మకాలకు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ఆత్మనిర్భర్‌ ద్వారా రుణం పొందిన వీధి వ్యాపారుల్లో అతి తక్కువ మందిని మన్‌కీ బాత్‌కు ఎంపిక చేశారు. అందులో పాషా ఒకరని మెప్మా పీడీ భద్రు తెలిపారు. పీఎంఓ నుంచి ఫోన్‌ వచ్చిన విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానంటూ పాషా ఆనందం వ్యక్తం చేశారు.

Also Read:

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి