Horoscope Today: ఈ రాశివారు ముఖ్యమైన పనులు చేపడతారు.. ఖర్చులు పెరుగుతాయి.. స్నేహితులతో వివాదాలు..!

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు..

Horoscope Today: ఈ రాశివారు ముఖ్యమైన పనులు చేపడతారు.. ఖర్చులు పెరుగుతాయి.. స్నేహితులతో వివాదాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2021 | 6:38 AM

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే జూన్‌ 30న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

​మేషరాశి

ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన పనుల్లో కుటుంబ సహకారం అవసరమై ఉంటుంది. విలువైన సమాచారం అందుకుంటారు. పేదవారికి కందిపప్పు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

వృషభరాశి

చేపట్టిన వ్యవహరిక పనుల్లో మంచి జరుగుతుంది. కొన్ని పనుల్లో ఆశించిన ఫలితాలు ఉండవు. అందుకే ఏ పనులు చేపట్టినా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి

చేసే పనుల్లో పరిష్కారం నెమ్మదిగా ఉంటుంది. సంగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అందరి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. పేదవారికి పాలు, పండ్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారాలలో ఆలోచించి అడుగులు వేయాలి. శ్రీవేంకటేశ్వరస్వామికి తులసీ దళాలలతో పూజించడం మంచి జరుగుతుంది.

సింహ రాశి

వ్యక్తిగతంగా అప్పులు చేస్తుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవారికి మామిడి పండ్లు దానం చేయడం మేలు జరుగుతుంది. అమ్మవారిని పూజించడం మేలు చేస్తుంది.

కన్య రాశి

మీరు చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మేలు జరుగుతుంది. ఖర్చులు పెట్టే ముందు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తుల రాశి

ఈ రాశివారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్క అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

స్నేహితులతో వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి

నూతనంగా ఉద్యోగాలు చేసేవారికి లాభాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. శివాలయంను దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

మకర రాశి

ఈ రాశివారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిళ్లు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

కుంభ రాశి

వ్యవహారిక విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. లలిత అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకుంటారు. విష్ణుసహాస్రనామ పారాయణం మేలు చేస్తుంది. పేదవారికి అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం మంచి జరుగుతుంది.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!