AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Astrology 2025: సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం..

Ugadi 2025 Love Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ప్రేమలో ఎంతో చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఉంటారు. వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీనం రాశుల వారు ప్రేమ విషయంలో అత్యంత నమ్మకస్థులు. వీరు తమ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరి ప్రేమ వ్యవహారాలు సాధారణంగా పెళ్లితో ముగుస్తుంది. ఈ రాశుల వారితో ప్రేమలో పడటం అదృష్టమే!

Love Astrology 2025: సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం..
Love Astrology 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 29, 2025 | 3:07 PM

ప్రేమలో పడడమనేది సహజమైన విషయమే కానీ, ఎక్కువ మందిలో చిత్తశుద్ది, నిబద్ధత తక్కు వగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలన్నీ పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అయితే, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమ జీవితానికి నూరు శాతం కట్టుబడి ఉండి, బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు సాధారణంగా ప్రేమ వ్యవహారాల్లో చిత్తశుద్ధితో, నిబద్ధతతో వ్యవహరించడంతో పాటు, అత్యుత్తమ ప్రేమికులుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఈ రాశుల వారిని ప్రేమించడం వల్ల సుఖ సంతోషాలకు లోటుండదు.

  1. వృషభం: ఈ రాశివారు పెళ్లి వ్యవస్థకు, కుటుంబ బాధ్యతలకు కట్టుబడి ఉంటారు. సరైన కుటుంబ జీవితం కోసమే ఎవరినైనా ప్రేమించడం జరుగుతుంది. ఈ రాశివారు తేలికగా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని అత్యధికంగా నమ్మడం, వీరికి భారీగా కానుకలు అందించడం జరిగే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితం తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది. వీరి ప్రేమ జీవితాంతం కొనసాగుతుంది. ఉగాది తర్వాత వీరు ప్రేమలో పడడం, ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
  2. కర్కాటకం: బాంధవ్యాలకు, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు సాధారణంగా ఏక పత్నీవ్రతులు అయి ఉంటారు. భావోద్వేగాలు అత్యధికంగా ఉండే ఈ రాశివారు తేలికగా ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం కోసం వీరు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడడం జరుగుతుంది. వీరు తమ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ప్రస్తుతం ఈ రాశివారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.
  3. కన్య: ఏ విషయంలోనైనా ప్రణాళికాబద్ధంగానూ, జాగ్రత్తగానూ వ్యవహరించే ఈ రాశివారు తమకు కావలసిన వ్యక్తిని ఎంపిక చేసుకుని ప్రేమించడం ప్రారంభిస్తారు. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వీరు ఇక మనసు మార్చుకోవడం జరగదు. వివాహ వ్యవస్థకు, కుటుంబ జీవితానికి ఈ రాశివారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇటువంటి వారితో ప్రేమలో పడడం అదృష్టంగా భావించాలి. ఇతరుల మనసులను అర్థం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. వీరు ఈ ఏడాది ప్రేమలో పడే అవకాశం ఉంది.
  4. తుల: ప్రతి క్షణం సంతోషంగా ఉండడానికి ఇష్టపడడంతో పాటు, సరదా జీవితం గడిపే ఈ రాశివారు కుటుంబ జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీరితో ప్రేమను పంచుకోవడం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎంతో అనుకూలంగా, ప్రేమగా ఉండే వీరు తప్పకుండా కొత్త సంవత్సరంలో ప్రేమలో పడడంతో పాటు వివాహ జీవితాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి కట్టుబడి ఉండే ఈ రాశివారు ప్రేమ భాగస్వామి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు.
  5. మకరం: ఈ రాశివారు సాధారణంగా ఏక పత్నీవ్రతులుగా ఉంటారు. ప్రేమలోగానీ, పెళ్లి జీవితంలో గానీ జీవిత భాగస్వామిని మోసగించడం జరగదు. కుటుంబ బాధ్యతలకు, కుటుంబ భద్రతకు, వివాహవ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇచ్చే ఈ రాశివారు ప్రేమలో పడితే తన నిర్ణయాన్ని మార్చుకోరు. వీరితో ప్రేమలో పడినా, వివాహం అయినా జీవితానికి భద్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గురు, శుక్రుల అనుకూలత వల్ల ఈ రాశివారు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
  6. మీనం: సాధారణంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడంతో పాటు ఏ విషయాన్నయినా లోతుగా ఆలోచించే అలవాటున్న ఈ రాశివారు ప్రేమలో పడినా, పెళ్లయినా ‘ప్రేమ’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఒకసారి ప్రేమలో పడితే ఇక వెనుదిరిగి చూసే అవకాశం ఉండదు. పెళ్లి, కుటుంబ వ్యవస్థలకు కట్టుబడి ఉండే ఈ రాశివారు ఈ ఏడాది పరిచయస్థులతో ప్రేమలో పడి, ఏడాది లోగా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశివారిని ప్రేమించినవారు అన్ని విధాలా అదృష్టవంతులవుతారు.