మూడు గ్రహాలతో చంద్రుడు యుతి.. ఈ రాశుల వారికి అంతా శుభ యోగాలే..!
Lucky Zodiac Signs: జులై 20 నుండి 26 వరకు చంద్రుడు మూడు గ్రహాలు శుక్ర, గురు, బుధులతో యుతి చెందుతాడు. ఈ అరుదైన యుతి ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, శుభ ఫలితాలను తెస్తుంది. ఆదాయ వృద్ధి, ఆస్తి లాభాలు, వివాహ యోగాలు వంటి అనేక శుభ యోగాలు ఏర్పడతాయి.

Shubh Yoga
ఈ నెల(జులై) 20 నుంచి 26 వరకు సుమారు వారం రోజుల పాటు చంద్రుడు వరుసగా శుక్ర, గురు, బుధులతో యుతి చెందడం జరుగుతోంది. చంద్రుడు ఈ విధంగా మూడు శుభ గ్రహాలతో వరుసగా యుతి చెందడం చాలా అరుదు. చంద్రుడు ఈ గ్రహాలతో ఎప్పుడు కలిసినా ఏదో ఒక యోగాన్ని కలిగిస్తాడు. ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలతో పాటు అనేక శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అరుదైన కలియిక వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశివారికి తప్పకుండా శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి రాబోతున్నాయి.
- మేషం: శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులతో చంద్రుడి కలయిక వల్ల ఈ రాశివారికి ఓ వారం రోజుల పాటు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా సంపద పెరుగుతుంది. తల్లి తండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితోనూ, ధన స్థానంలో గురువుతోనూ, తృతీయంలో బుదుడితోనూ చంద్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సాధారణ ఆర్థిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవనశైలి, స్థితిగతులు మారిపోతాయి.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు వరుసగా మూడు శుభ గ్రహాలతో కలవడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అరుదైన మహాలక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం వంటివి జరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య, దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాలను చంద్రుడు కలుసుకోవడం వల్ల విదేశాల్లో ఉద్యోగం లభించడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశముంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంటుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు వరుసగా శుక్ర, గురు, బుధులను కలవడం వల్ల విపరీత రాజయోగం, కుబేర యోగం కలిగాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. సప్తమంలో గురు, చంద్రులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా మహా భాగ్య యోగం పట్టే అవకాశముంది. సంపన్న వ్యక్తితో వివాహం నిశ్చయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. జీవన విధానంలో మార్పు వస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- కుంభం: ఈ రాశివారికి 4, 5, 6 స్థానాల్లో చంద్రుడు శుభ గ్రహాలను కలవడం వల్ల సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. నిరుద్యోగుల కల నెరవేరుతుంది.



