Luck Astrology: కుజ, కేతువుల కలయికతో ఆ రాశుల వారికి అదృష్టం.. వారు జాగ్రత్తగా ఉండాలి..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజ, కేతువుల కలవడం అన్నది ఒక రకంగా ప్రమాద సంకేతం. పాశ్చాత్య జ్యోతిషశాస్త్రం కూడా దీన్ని ఒక ‘డెడ్లీ కాంబినేషన్’గానే భావిస్తుంటుంది. ప్రస్తుతం ఈ కుజ, కేతువుల కలయిక తులా రాశిలో చోటు చేసుకుంది. ఈ నెల 24 తర్వాత కేతువు ఈ కుజ గ్రహాన్ని వదిలిపెట్టి, కన్యలోకి మారే వరకూ ఈ కలయిక కొనసాగుతుంది.

Zodiac Signs
జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజ, కేతువుల కలవడం అన్నది ఒక రకంగా ప్రమాద సంకేతం. పాశ్చాత్య జ్యోతిషశాస్త్రం కూడా దీన్ని ఒక ‘డెడ్లీ కాంబినేషన్’గానే భావిస్తుంటుంది. ప్రస్తుతం ఈ కుజ, కేతువుల కలయిక తులా రాశిలో చోటు చేసుకుంది. ఈ నెల 24 తర్వాత కేతువు ఈ కుజ గ్రహాన్ని వదిలిపెట్టి, కన్యలోకి మారే వరకూ ఈ కలయిక కొనసాగుతుంది. ఈ కలయిక వల్ల వృషభం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారికి అదృష్టం పడుతుండగా, మిగిలిన రాశుల వారికి మాత్రం కాస్తో కూస్తో నష్టం జరిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఈ కుజ, కేతువుల యుతి చోటు చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. జీవిత భాగస్వామితోనే కాదు, వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఇరుగు పొరుగుతో కానీ, ఇంటి యజమానితో కానీ సమస్యలు తలెత్తవచ్చు. ఓ ఇరవై రోజుల పాటు తగ్గి ఉండడం మంచిది.
- వృషభం: ఈ రాశివారికి ఈ కుజ, కేతువుల కలయిక వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి యోగం పట్టిస్తుంది. ఉద్యోగంలో సహచరుల కంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు వెనక్కి తగ్గడం జరుగుతుంది. మొత్తం మీద శత్రు బాధ తగ్గుతుంది. శత్రువులు మిత్రులుగా మారడం కూడా జరగవచ్చు. ఆదాయం పెరిగి రుణ సమస్యలు చాలావరకు పరిష్కారం అవు తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ కలయిక ఏర్పడడం వల్ల ఓర్పు, సహనాలు బాగా తగ్గు తాయి. చీటికి మాటికి తగాదాలకు దిగే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి భంగపడడం కూడా జరుగుతుంది. పిల్లల వల్ల సమస్యలు ఏర్పడ తాయి. ఆలోచనలు, ప్రయ త్నాలు ఒక పట్టాన కలసి రావు. తండ్రితో విభేదాలు తలెత్తవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. మితిమీరిన ఔదార్యం, దయాదాక్షిణ్యాల వల్ల బాగా నష్టపోతారు.
- కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ కలయిక చోటు చేసుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సుఖ సంతోషాలు తగ్గుతాయి. కుటుంబంలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా బంధువుల నుంచి అప నిందలు మీద పడతాయి. మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారతారు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి.
- సింహం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కుజ, కేతువుల కలయిక జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఏ వ్యవహారంలోనైనా దూసుకు పోతారు. ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. శత్రువులు, విమర్శకులు సైతం అనుకూలంగా మారడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల అంచనాలకు మించిన లాభం ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవు తుంది.
- కన్య: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో ఈ ప్రమాదకర కలయిక చోటు చేసుకున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి కానీ, కుటుంబంలో సమస్యలు విజృంభిస్తాయి. రుణ భారం బాగా తగ్గుతుంది. కోపతాపాలు ఎక్కువై, కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది. ఏ మాట అన్నా అవ తలవారికి అది తప్పుగా వినిపిస్తుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వ్యవహారాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. డబ్బు వృథా అవుతుంది.
- తుల: ఈ రాశిలోనే ఈ కలయిక ఏర్పడుతున్నందువల్ల, అహంకారంతో వ్యవహరించడం, పట్టు విడు పులు లేకుండా ప్రవర్తించడం, అనవసరం దుర్భాషలాడడం వంటివి ఎక్కువై, ఇమేజ్ దెబ్బతి నడం, కొంత నష్టపోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పోటీ పరీక్షలలో నెగ్గడానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. దూర ప్రయా ణాలు చివరి క్షణంలో వాయిదా పడడం, ప్రయాణాల వల్ల నష్టపోవడం వంటివి జరుగుతాయి.
- వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు వ్యయ స్థానంలో కేతువు వంటి వక్ర గ్రహంతో కలవడం వల్ల చెడు స్నేహాలు, అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలు చుట్టుముట్టే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉంది. వృథా వ్యయం కూడా తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. నమ్మక ద్రోహం జరిగే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ఎటువంటి ప్రతిఫలం లేకుండా పనిభారం పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి ఈ కలయిక మంచి అదృష్ట యోగం కలిగిస్తుంది. ఈ రాశికి లాభ స్థానంలో ఈ కలయిక ఏర్పడినందువల్ల అత్యంత ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఏ పని తలపెట్టినా అందులో లాభం ఉంటుంది. ఒక ప్రముఖుడుగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆశించిన పురోగతి సాధిస్తారు.
- మకరం: దశమ స్థానంలో కుజ, కేతువుల కలయిక వల్ల ఈ రాశికి వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి అదృష్టం పడుతుంది. విమర్శించేవారు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, గౌరవమర్యాదలు బాగా విస్తృతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు అంది వస్తాయి. బదిలీలు, స్థాన చలనాలు ఆగిపోవచ్చు. కుటుంబ పెద్దల అండదండలు లభిస్తాయి.
- కుంభం: ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో ఈ కలయిక చోటు చేసుకోవడం వల్ల శుభకార్యాలు వాయిదా పడడం, అందాల్సిన శుభవార్తలు అందకపోవడం, తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించడం వంటివి జరుగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కాకుండా మొండికే స్తుంది. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఇతరులకు సలహాలు ఇవ్వడం, ఇతరుల వ్యవ హారాల్లో తలదూర్చడం వంటివి పెట్టుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయడం కూడా మంచిది కాదు.
- మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఈ కలయిక చోటు చేసుకోవడం వల్ల బంధుమిత్రుల నుంచి అప నిందలు మీద పడే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాల కారణంగా పేరు దెబ్బతింటుంది. సతీమణితో విభేదాలు తలెత్తుతాయి. ఇరుగు పొరుగుతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువవుతుంది కానీ ప్రతిఫలం ఉండదు. ఇతరుల కోసం కష్టపడాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి







