Eclipse 2023: ఈ నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు.. పురాణాల ప్రకారం రాహు, కేతువు గ్రహణ కారకాలు
ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు అక్టోబర్‌లో ఏర్పడనున్నాయి. ఈ నెలలో 14వ తేదీ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అక్టోబర్ 28వ తేదీ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం రాహువు, కేతువులు గ్రహణానికి ప్రధాన కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రాహువు, కేతువులు సూర్యచంద్రులను మింగే సమయంలో గ్రహణం ఏర్పడుతుందని విశ్వాసం.
హిందూ మతంలో గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనవి. ఇది మంచి, చెడు రెండింటిలోనూ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహణానికి ముందు సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. గ్రహణ కాలంలో శుభ కార్యాలు చేయడం నిషిద్ధం. అయితే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ముందు సూతకం సమయం చాలా భిన్నంగా ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో, సూతకం 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. అదే చంద్రగ్రహణంలో సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సుతక సమయం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు, పూజలు చేయడం నిషేధించబడింది.
ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు అక్టోబర్‌లో ఏర్పడనున్నాయి. ఈ నెలలో 14వ తేదీ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అక్టోబర్ 28వ తేదీ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం రాహువు, కేతువులు గ్రహణానికి ప్రధాన కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రాహువు, కేతువులు సూర్యచంద్రులను మింగే సమయంలో గ్రహణం ఏర్పడుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో రాహువు, కేతువులు ఎవరు? ఎందుకు సూర్య చంద్రులను మింగుతారో తెలుసుకోవడం ముఖ్యం?
రాహు కేతువులు ఎవరు?
హిందూ మత గ్రంధాల్లో రాహు, కేతు గ్రహాలను పాములుగా పరిగణిస్తారు. జాతకంలో అశుభ స్థానంలో ఉంటే కాలసర్ప దోషం ఏర్పడుతుంది. రాహువు, కేతువు సూర్యుడిని, చంద్రుడిని మింగే సమయంలో గ్రహణం ఏర్పడుతుంది.
రాహు కేతువులు ఎలా ఆవిర్భవించారంటే
హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. ఆ సమయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం చెలరేగింది. అప్పుడు ఈ వివాదానికి ముగింపు పలకడానికి విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి ప్రతి ఒక్కరికీ అమృతాన్ని పంచుతానని చెప్పాడు. అప్పుడు మోహిని అందాన్ని చూస్తూ రాక్షసులు సహా దేవతలు మోహిని ప్రతిపాదనను అంగీకరించారు. ముందుగా దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. అయితే మోహినిని అనుమానించిన స్వరభానుడు అనే రాక్షసుడు దేవత రూపాన్ని ధరించి దేవతల పంక్తిలో కూర్చున్నాడు. మోహిని అందరికి అమృతం పంచినట్లు.. స్వరభానుడికి కూడా అమృతాన్ని పంచుతాడు. అప్పుడు సూర్య చంద్రులు రాక్షసుడి రహస్యం తెలుసుకుని మోహిని రూపంలో ఉన్న విష్ణువుకు చెబుతారు.
అప్పుడు మహా విష్ణువు కోపించి సుదర్శన చక్రంతో స్వరభానుడు తలను, మొండాన్ని వేరు చేశాడు. అయితే అప్పటికే స్వరభానుడు రెండు-మూడు చుక్కల అమృతాన్ని సేవించాడు. అందుకే అతను చనిపోలేదు. అతని తల , మొండెం అమరత్వం పొందాయి. ఆ తరువాత తల రాహువు గ్రహంగా .. మొండెం కేతువుగా పిలుస్తున్నారు. నవ గ్రహాల్లో రాహు, కేతువులు ప్రముఖ స్థానాన్ని పొందాయి. సూర్యుడు, చంద్రుడు అసురుడి రహస్యాన్ని వెల్లడించినందున రాహువు, కేతువులు ఎప్పటికప్పుడు సూర్యుడిని, చంద్రులను మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని పురాణాల కథనం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.